English   

నితిన్ కు క్రేజీ ఆఫర్

Nithiin-kamal

కొన్ని ఆఫర్స్ మెమరబుల్ గా ఉంటాయి. అలాంటి మెమరబుల్ ఆఫర్ ఒకటి నితిన్ కు వచ్చిన టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం చల్ మోహన్ రంగాతో ఫుల్ బీజీగా ఉన్నాడు నితిన్. దీని తర్వాత ఆల్రెడీ శ్రీనివాస కళ్యాణం స్టార్ట్ చేశాడు. ఈ రెండూ ష్యూర్ షాట్స్ గా కనిపిస్తోన్న సినిమాలే. ఈ నేపథ్యంలో నితిన్ కు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా కమల్ హాసన్, విక్రమ్ లు అసోసియేట్ అయిన ఉన్న సినిమాలో. యస్.. ఈ ఇద్దరూ కలిసి ఉండే సినిమాలో నితిన్ కూడా తీసుకున్నారంటున్నారు. కమల్ హాసన్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ (రాజ్ కమల్ ఇంటర్నేషన్)నుంచి చాలాకాలం తర్వాత ఓ సినిమా నిర్మిస్తున్నాడు. ఇందులో విక్రమ్ హీరో. కమల్ హాసన్ కేవలం నిర్మాతగా మాత్రమే ఉంటాడు. ఇది ఎప్పుడో కన్ఫార్మ్ అయిన ప్రాజెక్ట్. కమల్ హాసన్ తో చీకటి రాజ్యం అనే సినిమా తీసిన రాజేశ్ సెల్వ ఈ చిత్రానికి దర్శకుడు. చీకటి రాజ్యం ను ఓ ఫ్రెంచ్ మూవీ నుంచి తీసుకుని చేశారు. ఇప్పుడీ మూవీ కూడా మరో ఫ్రెంచ్ మూవీ నుంచి రీమేక్ చేస్తున్నదే. 

ఈ కొత్త సినిమాలో విక్రమ్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకునే చాన్స్ నితిన్ కు వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నితిన్ చేయబోయే పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంట. ఒక రకంగా చాలా కీలకమైన పాత్ర. అలాంటి పాత్రకు నితిన్ అయితే బావుంటుందని ఎంటైర్ టీమ్ ఫీలైయి అతన్ని అప్రోచ్ అయినట్టు చెబుతున్నారు. దీని వల్ల సినిమాకు రెండు రకాలుగా లాభం కూడా ఉంటుంది. ఒకటి విక్రమ్ కు తెలుగులో మార్కెట్ తగ్గింది. అది సినిమాకు మైనస్ కాకండా నితిన్ ఇమేజ్ కాపాడుతుంది. అలాగే నితిన్ కూడా తమిళ్ లో అరంగేట్రం చేసినట్టువుతుంది. ప్రస్తుతం రూమర్ గా వినిపిస్తోన్న ఈ వార్తకు సంబంధించిన అసలు విషయం త్వరలోనే తెలియజేస్తారని టాక్. 

ఏదేమైనా నితిన్ మాత్రం ఎన్నాళ్లని తెలుగు మార్కెట్ నే నమ్ముకుంటాడు. మొన్నటికి మొన్న వచ్చిన విజయ్ దేవరకొండ అప్పుడే కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే పాతిక సినిమాల వయసు వచ్చిన నితిన్ ఇకనైనా మార్కెట్ ను విస్తరించుకుంటే మంచిది. కాకపోతే మరీ చిన్న పాత్ర కాకుండా కాస్త లెంగ్తీ రోల్ చేస్తే ఖచ్చితంగా అతను తమిళ్ లోనూ రిజిస్టర్ అవుతాడు.. ఇప్పటికే అతను చేసిన జయం వంటి సినిమాలు అక్కడ రీమేక్ అయి మంచి విజయాలు సాధించాయి కాబట్టి.. అక్కడి వాళ్లు అతన్ని ఓన్ చేసుకోవడం పెద్ద ఇబ్బందేం కాదు.

More Related Stories