English   

హిట్టిచ్చిన డైరెక్టర్ కి మళ్ళీ చాన్స్ !

Nithiin
2019-03-18 12:09:04

చాన్నాళ్ళ నుండి హిట్ లు లేక ఇబ్బంది పడుతున్న నితిన్ తనకి ఒక మంచి హిట్ ఇచ్చిన దర్శకుడికి రెండో సినిమా ఆఫర్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. గతంలో నితిన్ - విజయ్ కుమార్ కొండా కాంబినేషన్ లో గుండె జారి గల్లంతయ్యిందే సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన నితిన్ కి ఒక కధ చెప్పడం దానికి నితిన్ ఓకే చెప్పడం జరిగాయని సమాచారం అందుతోంది. నిజానికి చాన్నాళ్ళ నుండి హిట్ లేక సరయిన కధ కోసం నితిన్ చూస్తున్న నితిన్ సరయిన కధ దొరికితే తానే ప్రొడ్యూస్ చేయడానికి కూడా సిద్దమయ్యాడు. ఇదే సమయంలో విజయ్ చెప్పిన కధ నచ్చడంతో అయన ఓకే చెప్పాడని, ఇప్పుడు ఆ లైన్ ని డెవలప్ చేసే పనిలో విజయ్ ఉన్నాడని అంటున్నారు. ప్రస్తుతం దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి 'భీష్మ' సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లే పనిలోవున్న నితిన్ ఆ తర్వాత విజయ్ కుమార్ కొండాతోనే సినిమా చేయనున్నారట.  అంతే కాక నితిన్ ఇప్పటికే రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఈ నెలలోనే వివరాల్ని వెల్లడిస్తానని చెప్పాడు. చూడాలి మరి ఆ రెండిటిలో ఈ సినిమా ఉంటుందో లేదో  ?
 

More Related Stories