English   

నభా నటేష్ తో రొమాంటిక్ రైడ్ లో నితిన్

 Nithiin
2021-04-21 11:37:12

కోవిడ్ ప్ర‌భావంలో థియేట‌ర్స్ ఓపెన్ అయిన త‌ర్వాత వరుస సినిమాలతో సందడి చేసాడు నితిన్.  ఈ నేపథ్యంలో వచ్చిన 'చెక్' పరాజయంపాలు కాగా, ఆ తరువాత వచ్చిన 'రంగ్ దే' మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. ఇక ప్రస్తుతం నితిన్  మాస్ట్రో షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.  ఈ శ్రీరామనవమికి తన అభిమానులకు , సినీ ప్రేక్షకులకు శుభాకాంక్షలుచెప్పేశాడు నితిన్.  ఈ సినిమా నుంచి ఒక కొత్త పోస్టర్ ను వదిలారు. స్కూటర్ ను నభా నటేష్ నడుపుతూ ఉండగా.. అంధుడి పాత్రను పోషిస్తున్న నితిన్ ఆమె వెనక కూర్చుని ఉన్నాడు.   

మేర్ల పాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాయే బాలీవుడ్ మూవీ అంధాదున్ రీమేక్‌. ఈ రీమేక్‌ను నితిన్ త‌న సొంత బ్యాన‌ర్ శ్రేష్ఠ్ మూవీస్‌లో నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా చేసిన పాత్ర‌ను తెలుగులో నితిన్ చేస్తుండ‌గా.. రాధికా ఆప్టే చేసిన హీరోయిన్ పాత్ర‌లో న‌భా న‌టేశ్ న‌టిస్తోంది. ఇక సినిమాలో మెయిన్ రోల్ ట‌బు. ఈ పాత్ర‌ను తెలుగులో త‌మ‌న్నా భాటియా చేస్తుండ‌టం విశేషం. ఓ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో త‌మ‌న్నా న‌టిస్తుండ‌టం కూడా ఇదే ఫ‌స్ట్ టైమ్‌.   

More Related Stories