English   

నితిన్ జీల‌క‌ర్ర బెల్లం పెట్టేశాడు

Srinivasa-Kalyanam
2018-03-04 19:05:56

నితిన్ జీల‌క‌ర్ర బెల్లం పెట్టేశాడు. అంటే పెళ్లైపోయిన‌ట్టే క‌దా.. అవును పెళ్లి కూడా అయిపోయిన‌ట్టే. మ‌రి ఈ క‌ళ్యాణం పేరేంటో తెలుసా.. శ్రీనివాస క‌ళ్యాణం. ఇది సినిమా పేరు క‌దా అనుకుంటున్నారా.. అవును మ‌రి.. శ్రీనివాస క‌ళ్యాణంతో వ‌స్తోన్న నితిన్ ఈ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్   అండ్ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ మోష‌న్ పోస్ట‌ర్ లోనే అబ్బో ఎన్నో చూపించేశారు. నితిన్ హీరోయిన్ రాశిఖ‌న్నా త‌ల‌పై జీల‌క‌ర్ర బెల్లం పెట్టుకోవ‌డం, తాళి క‌ట్ట‌డం, అక్షింత‌లు జ‌ల్లుకోవ‌డం.. అలాగే అద్దంలో చూసుకుంటే ఒకిరికి మ‌రొక‌రి ప్ర‌తిబంబాలు క‌నిపించ‌డం. ఇవ‌న్నీ చూస్తుంటే ఇది కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా అనిపించ‌క‌మాన‌దు. దిల్ రాజు నిర్మాణంలో శ‌త‌మానం భ‌వ‌తి ఫేమ్ స‌తీష్ వేగేశ్న ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. 

శ‌త‌మానం భ‌వ‌తితో అనెక్స్ పెక్టెడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన ఈ ద‌ర్శ‌కుడిని మ‌రోసారి న‌మ్మాడు దిల్ రాజు. మొద‌ట్లో ఈ క‌థ ఎన్టీఆర్ కు చెప్పిన‌ట్టు టాక్ వినిపించింది. అత‌ను ఇప్పుడు కుద‌ర‌దు అన్నాడు. త‌ర్వాత మ‌రికొంద‌రు హీరోల చుట్టూ తిరిగి ఫైన‌ల్ గా నితిన్ ద‌గ్గ‌ర ఆగింది. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. మోష‌న్ పోస్ట‌ర్ చూస్తే అంతా హ్యాపీగానే ఉంది. కానీ ఇందులో మ‌రో హీరోయిన్ కూడా ఉంది. త‌నే మోస్ట్ టాలెంటెడ్ గాళ్ నందితా శ్వేత‌. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్టిన ఈ భామ కూడా శ్రీనివాస‌క‌ళ్యాణంలో కీల‌క పాత్ర చేస్తోంది. మ‌రి త‌న క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుందో కానీ.. నితిన్ మాత్రం ఈ మూవీపై కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. 

ఇక నితిన్ ప్ర‌స్తుతం త‌న కెరీర్ లో 25వ సినిమా చేస్తున్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్, శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌కుడు. త్ర‌విక్ర‌మ్ క‌థ అందించాడు. ఛ‌ల్ మోమ‌న్ రంగాగా రాబోతోన్న  ఈ మూవీ ఆల్మోస్ట్ పూర్త‌యిన‌ట్టే. నితిన్ తో లై మూవీలో రొమాన్స్ చేసిన మేఘా ఆకాశ్ మ‌రోసారి అత‌నితో రొమాన్స్ చేస్తోందీ మూవీలో. మొత్తంగా ఆ మ‌ధ్య రెండు సినిమాలు నిర్మించి భారీగా న‌ష్ట‌పోయిన నితిన్ ఇప్పుడు వేగం పెంచి ఆ లాస్ ను భ‌ర్తీ చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు.

More Related Stories