English   

శ్రీనివాస కళ్యాణం కు విడాకుల ప్రమాదం

Nithin Raashi Khanna Movie Srinivasa Kalyanam Story
2018-08-04 06:34:06

మీరు చదివింది కరెక్టే.. దిల్ రాజు శ్రీనివాస కళ్యాణం కే విడాకుల ప్రమాదం పొంచి ఉంది. కొన్నిసార్లు ఏదైతే కొత్తగా ఉంటుంది అనుకుంటామో అదే చెత్తగా మారుతుంది. లేదంటే అదే మైనస్ అవుతుంది.. అదే హైలెట్ అవుతుంది. కాకపోతే మనకు పెళ్లి బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాల్లో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. కానీ నెగెటివ్ ఎమోషన్ మాత్రం ఇప్పటి వరకూ పెద్దగా టచ్ కాలేదు. అది కూడా హీరో హీరోయిన్ల మధ్య. అపార్థాలున్నాయి.. అర్థం లేని అండర్ స్టాండింగ్స్ లేవు. ప్రస్తుతం నితిన్, రాఖిఖన్నా జంటగా నటించిన శ్రీనివాస కళ్యాణంలో కూడా ఇలాంటి ‘అండర్ స్టాండింగ్స్’ఉన్నాయనే టాక్ టాలీవుడ్ లో హల్చల్ చేస్తోంది. నిజానికి ఈ సినిమా గురించి ఈ మాట విన్నవాళ్లంతా ఇదేం కాన్సెప్టూ అంటున్నారు. మరి అంతలా నెగెటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోన్న ఆ కాన్సెప్ట్ ఏంటో తెలుసా.. విడాకులు.

ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీనివాస కళ్యాణం గురించి వినిపిస్తోన్న కథ ఒకటుంది. నిజానికి ఇదే నిజం అనేవాళ్లే ఎక్కువ. ఆ కథ ప్రకారం సినిమా కథేను సింపుల్ గా చెబితే.. ఈ సినిమాలో హీరోయిన్ అక్కకు పెళ్లవుతుంది. ఆ భార్యాభర్తల మధ్య మిస్ అండర్ స్టాండింగ్స్ రావడంతో విడాకులు తీసుకుంటారు. కానీ ఆ జంట కాపురంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ ఇంటి పెద్ద రెండో కూతురు పెళ్లి విషయంలో ఓ మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అవే విడాకులు. అంటే పెళ్లి తర్వాత ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ వచ్చినా విడాకులుతీసుకోవడానికి సిద్ధంగా ఉంటామని హీరో హీరోయిన్లిద్దరితోనూ ఓ విడాకుల పత్రం రాయిస్తాడు. అంటే లైఫ్ లో ఎప్పుడూ ఇష్టం లేని కాపురం చేయొద్దు. అందుకే విడాకులుకు సిద్ధపడే పెళ్లి చేసుకోవాలనే కండీషన్ అన్నమాట. అన్నమాట ప్రకారం కొన్ని సెంటిమెంట్ ఎమోషన్స్ సీన్స్ తర్వాత ఆ ఇద్దరూ ‘‘పెళ్లికి ముందే విడాకుల’’పై సంతకం చేస్తారు. ఇది ఇంటర్వెల్ బ్యాంగ్. ఇక ఆ తర్వాత పెళ్లి.. ఆ ఘట్టం తాలూకూ సీన్స్.. ఎమోషన్స్ ఇలా ఉంటాయట. మరి ముందే సంతకం అయింది కాబట్టి.. ఆ పత్రాలకూ కాస్త పనిపెట్టే మరికొన్ని మిస్ అండర్ స్టాండింగ్ సీన్స్ ప్రీ క్లైమాక్స్ గా.. మళ్లీ అన్ని సర్ధుకుని పెళ్లంటే నూరేళ్ల పంట.. అది మన భారతదేశపు గొప్ప బంధం వంటి రెగ్యులర్ డైలాగ్స్ తో శుభం కార్డ్. ప్రస్తుతం ఈ శ్రీనివాస కళ్యాణం గురించి వినిపిస్తోన్న కథ ఇదే. మరి ఇలాంటి టైటిల్ తో, పాజిటివ్ వైబ్స్ ఉన్న ఓ సినిమాకు విడాకుల కాన్సెప్ట్ కాపాడుతుందా.. లేక మైనస్ అవుతుందా అనేది చూడాలి. బట్ తేడా వస్తే దిల్ రాజు డబుల్ హ్యాట్రిక్ జోష్ కు బ్రేక్ పడుతుంది.. బ్రేక్ కోసం చూస్తోన్న నితిన్ కు బ్రేక్ లెస్ అవుతుంది.

More Related Stories