English   

నితిన్-రాశీ రొమాన్స్ అదిరింది..!

srinivasakalyanam

తొలిసారి న‌టిస్తున్నపుడు హీరో హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ ఒక్కోసారి కుద‌ర‌దు. వాళ్ల మ‌ధ్య రొమాన్స్ కుద‌ర‌క కూడా కొన్ని సినిమాలు పోతుంటాయి. కానీ రాశీఖ‌న్నా, నితిన్ మాత్రం ఇందులో ఆరితేరిపోయారు. ఇద్ద‌రూ తొలిసారి జోడీ క‌ట్టినా కూడా ఒక‌రి కోసం ఒక‌రు అన్న‌ట్లు క‌లిసి పోయారు. శ్రీ‌నివాస క‌ళ్యాణం టీజ‌ర్ లోనే ఇద్దరి మ‌ధ్య కెమిస్ట్రీ మ‌రో స్థాయిలో ఉంది. ఇప్పుడు విడుద‌లైన పాట‌లో అయితే అది ఇంకో స్థాయికి చేరిపోయింది. ముందు నితిన్, రాశీఖ‌న్నా అంటే ఎలా సెట్ అవుతారో అనుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం వాళ్లే ప‌ర్ ఫెక్ట్ క‌పుల్ అనిపించారు.

ఇత‌డేనా ఇత‌డేనా అంటూ నితిన్ వైపు చూస్తూ రాశీఖ‌న్నా రాగాలు పాడుతుంటే స్క్రీన్ అంతా మెరిసిపోతుంది. మిక్కీ జే మేయ‌ర్ ట్యూన్ కు తోడు స‌మీర్ రెడ్డి కెమెరా మాయాజాలం కూడా పాట స్థాయిని పెంచింది. సినిమా ఆగ‌స్ట్ 9న విడుద‌ల కానుంది. దిల్ రాజు నిర్మాత‌. స‌తీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. శ‌త‌మానం భ‌వతి త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు కూడా అవే స్థాయిలో ఉన్నాయి. మొత్తానికి చూడాలిక‌.. రాశీ, నితిన్ కెమిస్ట్రీ ఫుల్ సినిమాలో ఎలా ఉండ‌బోతుందో..? 

More Related Stories