English   

నితిన్ వర్సెస్ నిఖిల్

nithin vs nikhil
2018-02-24 18:14:50

టాలీవుడ్ యంగ్ హీరోల్లో నితిన్, నిఖిల్ కి స్పెషల్ ఇమేజ్ ఉంది. డిఫరెంట్ స్టోరీస్ ని సెలక్ట్ చేసుకుంటూ మంచి మంచి హిట్స్ అందుకుంటున్నారు వీరిద్దరు. తమ కొత్త సినిమాలను ఈ సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్న నితిన్, నిఖిల్... సినిమాతో ప్రాబ్లమ్స్ లేవు కానీ.. ఇప్పుడు సాంగ్స్ తోనూ పోటీ పడటానికి రెడీ అయ్యారు.. కన్నడలో సంచలన విజయం సాధించిన కిర్రిక్ పార్టీకి రీమేక్ గా కిరాక్ పార్టీ పేరుతో సినిమా చేస్తున్నాడు నిఖిల్.  ఏకె. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో నిఖిల్ కాలేజ్ లీడర్ పాత్రలో కనిపించబోతున్నాడు.  ఇందుకోసం లుక్ ని కూడా మార్చేశాడు. కిరాక్ పార్టీకి సంబంధించి ఇఫ్పటి వరకు ఫస్ట్ లుక్ టీజర్, ఓ సాంగ్ విడుదలయ్యాయి. ఈ రెండింటికి రెస్పాన్స్ బాగానే వచ్చింది. నిఖిల్ కి జోడీగా సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరింజ నటించారు. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అయ్యాక ఈ సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుందని ఉద్దేశ్యంతో ఫిబ్రవరి నుంచి మార్చి 22కి పోస్ట్ పోన్ చేశారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని సెకండ్ సాంగ్ ని రేపు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయబోతుంది చిత్ర యూనిట్.

యూత్ స్టార్ నితిన్ కొత్త సినిమా చల్ మోహన్ రంగ. తన హోమ్ ప్రొడక్షన్ శ్రేష్ట్ మూవీస్ తో పాటు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రౌడీ ఫెలోతో మెగా ఫోన్ పట్టిన లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. నితిన్ కి జోడీగా ఈ చిత్రంలో మేఘా ఆకాష్ నటించింది. నితిన్-మేఘా కాంబినేషన్లో ఇది రెండో సినిమా. చల్ మోహన్ రంగ అనే టైటిల్ తోనే ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసింది చిత్ర యూనిట్. ఫస్ట్ లుక్ టీజర్ కి, అందులోనే డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. క్యూట్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

చల్ మోహన్ రంగా సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు రెడీ చేస్తోంది చిత్ర యూనిట్. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ ని రేపు విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 24నే నితిన్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కించిన ఇష్క్ మూవీ విడుదలయ్యింది. అందుకే నితిన్ సెంటిమెంట్ గా ఫీలై చల్ మోహన్ రంగలో ఫస్ట్ సాంగ్ ని ఆ రోజే రిలీజ్ చేస్తున్నాడు. పవన్-త్రివిక్రమ్ నిర్మాతలు కావడం సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్. సో..ఇలా సమ్మర్ లో హంగామా చేయబోతున్న నితిన్, నిఖిల్....తమ సినిమాల సాంగ్స్ ని ఒకే రోజు విడుదల చేస్తూ యూత్ ఆడియన్స్ లో హాట్ టాపిక్ గా మారారు.

More Related Stories