English   

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు భార్య‌గా నిత్యామీన‌న్

Nithya Menen
2021-05-03 18:41:43

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌లయాళ సూప‌ర్ హిట్ సినిమా అయ్య‌ప్ప‌నుమ్ కోషియం రీమేక్ లో హీరోగా న‌టిస్తు్న్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు  సాగర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించ‌గా క‌రోనా కార‌ణంగా షూటింగ్ కు బ్రేక్ ప‌డింది. అయితే తాజాగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతుంది. చిత్ర యూనిట్ ఈ సినిమాలో మొద‌ట సాయి ప‌ల్లవిని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ డేట్స్ స‌మ‌స్య రావ‌డంతో చ‌బ్బీ బ్యూటీ నిత్యామీన‌న్ ను తీసుకోవాల‌నుకున్నారు. ఇప్ప‌టికే నిత్యామీన‌న్ కు క‌థ వినించ‌గా ప‌వ‌న్ కు జోడీగా న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. దీనిపై త్వ‌ర‌లోనే అఫీషిల్ రాబోతున్న‌ట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రానా కు జోడీగా ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్ గా న‌టించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా నిత్యామీన‌న్ కు కూడా ఇది మంచి అవ‌కాశమ‌నే చెప్పాలి. ఎందుకంటే నిత్యామీన‌న్ స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి త‌ర‌వాత మ‌ళ్లీ పెద్ద సినిమాల్లో అవ‌కాశం ద‌క్కించుకోలేదు. ఇక ఈ సినిమాతో నిత్యా బౌన్స్ బ్యాక్ అయ్యే అవ‌కాశం ఉంది. అంతేకాకుండా ప్ర‌స్తుతం నిత్యామీన‌న్ వెబ్ సిరీస్ ల‌లోనూ న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంది. 

More Related Stories