English   

ఆగస్టులో పెళ్లి పీటలు ఎక్కనున్న నిత్యామీనన్

Nithya Menen
2020-10-22 09:00:01

అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ నిత్యామీనన్. పక్కింటి అమ్మాయిలా కనిపించే.ఈ అమ్మడు అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందాలు అరబోయకుండా ఇండస్ట్రీలో ఉండటం అంత ఈజీ కాదు. కానీ నిత్యామీనన్ అందాలు అరబోయకుండా తన నటనతో ఆఫర్లు దక్కించుకుని ఇప్పటికి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే నిత్యా గత కొంతకాలం గా సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. దాంతో నిత్య పెళ్లి పై ఫోకస్ పెట్టిందంటూ వార్తలు వచ్చాయి. మరోవైపు నిత్యామీనన్ ఎక్కువ బరువు 90 కేజీలు పెరిగిందంటూ అందుకే ఆమెకు ఆఫర్లు దక్కడం లేదంటూ కూడా టాక్ వినిపించింది. 

ఇక ఇప్పుడు తాజాగా నిత్యా మీనన్ ఆగస్టులో పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఓ తమిళ నటుడితో నిత్యా మీనన్ ప్రేమలో ఉందట. ఆ విషయాన్ని ఇరువురు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు కూడా పెళ్లికి అంగీకరించారట. దాంతో ఆగస్టులో నిత్యామీనన్ పెళ్లి పీటలు ఎక్కనుందని టాక్ వినోపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై నిత్యా స్పందించలేదు. ఇదిలా ఉండగా నిత్యామీనన్ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. తెలుగులో నిత్యా కొన్ని సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. వాటిలో అలా మొదలైంది, గుండె జారి గల్లంతయ్యింది, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు ఉన్నాయి.

More Related Stories