English   

హ‌లో నిత్యా ఆంటీ.. ఎలా ఉన్నారు..? 

Nithya-Menen-weight
2018-08-12 15:54:15

అవును.. ఇప్పుడు నిత్యామీన‌న్ క‌నిపిస్తే ఇలాగే పిల‌వాలి. హీరోయిన్ అంటే స‌న్న‌గా ఉండాలి.. జీరోసైజ్ చేయాలి అనే ప‌దాల‌కు ఈమె వ్య‌తిరేకం. అలాగ‌ని మ‌రీ బొద్దుగా కూడా ఉండ‌దు. చూడ్డానికి ముద్దుగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ నిత్యామీన‌న్ క‌నిపించ‌డం లేదు. పూర్తిగా ముప్పైల్లోనే ఆంటీ అయిపోయిన నిత్యా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం నిత్యామీన‌న్ ను చూస్తుంటే ఆమె అబిమానులే కాదు.. ఇండ‌స్ట్రీ కూడా షాక్ అవ్వ‌క త‌ప్ప‌దు. ఎందుకంటే అంత‌గా భారీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ సారీ సారి బొద్దుగుమ్మ‌. జూనియ‌ర్ న‌మిత‌లా మారిపోయింది నిత్యా. అస‌లే పొట్టిగా ఉంటుంది క‌దా.. ఇంకా లావుగా క‌నిపిస్తుంది. ఈ మ‌ధ్యే కొంద‌రు పిల్ల‌ల‌తో ఓ చిన్న వీడియో చేసిన నిత్యా.. అందులో మ‌రీ బొద్దుగా క‌నిపించింది. అస‌లేంటి నిత్యా ఇలా అయిపోయింద‌ని చూసిన వాళ్ల‌తో పాటు అభిమానులు కూడా నోరెళ్ల‌బెడుతున్నారు. ప్ర‌స్తుతం ఈమె ఓ ప్ర‌యోగాత్మ‌క సినిమాలో న‌టిస్తుంది. ఇందులో ఈమె త‌ప్ప ఎవ‌రూ ఉండ‌రు. 

మ‌ళ‌యాల ద‌ర్శ‌కుడు వికే ప్ర‌కాశ్ చెప్పిన క‌థ న‌చ్చి ప్రాణ సినిమా క‌మిటైంది నిత్యా. ఇందులో ఈమె త‌ప్ప ఇంకెవ‌రూ ఉండ‌రు. పీసీ శ్రీరామ్‌ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు. ప్రాణ సినిమాలో ఉన్న‌ది నిత్యా పాత్ర మాత్ర‌మే. సమాజంలో జ‌రిగే సమస్యలపై పోరాడే ర‌చ‌యిత్రి ప్రాణ పాత్ర‌లో న‌టిస్తుంది నిత్యామీన‌న్. సినిమాలో ఆమె మ్యూజిక్‌ ఆఫ్‌ ప్రీడమ్‌ అనే బుక్‌ రాస్తుంది. ఈ పుస్త‌కానికి కీల‌కం ఇది. అప్ప‌ట్లో జ‌గ‌ప‌తిబాబు అత‌డే ఒక సైన్యం అంటే ఇప్పుడు నిత్యా ఆమె ఒక సైన్యం అంటుంద‌న్న‌మాట‌. సింక్రోనైజ్డ్‌ సరౌండ్‌ సౌండ్‌ సిస్టమ్‌ అనే కొత్త టెక్నాలజీని సౌండ్‌ డిజైనర్‌ రసూల్‌ పూకుట్టి ఈ చిత్రం కోసం వాడుతున్నారు. ఒకేసారి నాలుగు భాష‌ల్లో ఈ చిత్రం వ‌స్తుంది. పైగా నిత్యామీన‌న్ కు క‌న్న‌డ‌, తెలుగు, మ‌ళ‌యాలం, త‌మిళ భాష‌లు వ‌చ్చు. కాబ‌ట్టి అన్ని భాష‌ల్లోనూ త‌నే డ‌బ్బింగ్ చెప్పుకుంటుంది. దానికి తోడు హిందీ కూడా వ‌చ్చు. వీలుంటే హిందీలోకి కూడా విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. మొత్తానికి నిత్యామీన‌న్ న‌ట‌న‌తో పాటు అప్పుడ‌ప్పుడూ కాస్త ఫిజిక్ కూడా దృష్టి పెడితే బాగుంటుందేమో..? 

More Related Stories