English   

నిత్యామీనన్ ఆల్బమ్ రెడీ

nithya
2020-01-17 19:26:55

చాలామంది హీరోయిన్లు తమ గ్లామర్ తో అందాల విందు చేస్తు, జీరో సైజ్ లో చాలా హాట్ గా దర్శనమిస్తు వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. కానీ బొద్దుగుమ్మ నిత్యమీనన్ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. తనకు ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ మాత్రమే చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ కన్నడ బ్యూటీ ఏదైనా సినిమాలో నటిస్తోంది అంటే.. ఆ సినిమా మినిమమ్ గ్యారంటీ అనే టాక్ కూడా ఉంది. ఎందుకంటే ఈ అమ్మడు ఎంచుకునే పాత్రలు, కథలు ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి. టాలీవుడ్ లో 'అలా మొదలైంది' చిత్రంతో ఎంట్రీ ఇచ్చి.. నటిగా, ప్లేబ్యాక్ సింగర్ గా తన వాయిస్ కు తానే డబ్బింగ్ చెప్పుకొని మల్టీ ట్యాలెంటెడ్ అనిపించుకుంది.
ప్రస్తుతం తెలుగు, తమిళ, మళయాళ సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. సింగర్ గానూ అలరించేందుకు సిద్దమయింది. ఇప్పటికే ఈ విషయాన్ని కన్ఫామ్ చేసినా నిత్య.. అతి త్వరలోనే తన మొదటి ఆల్బమ్ ను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఆల్బమ్ కోసం లండన్‌ కు చెందిన మ్యూజిక్‌ కంపోజర్‌ సౌమిక్‌ దత్తాతో కలిసి పని చేస్తోంది. తన తొలి మ్యూజిక్‌ ఆల్బమ్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దాంతో నిత్య అభిమానులు ఈ మ్యూజిక్ ఆల్బం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. అంటూ ఎదురు చూస్తున్నారు. మరి.. హీరోయిన్ గా సక్సెస్ అయిన.. ఈ బ్యూటీ మ్యూజిక్ ఆల్బమ్ స్టార్ గా ఎలా అలరిస్తుందో చూడాలి.

 

More Related Stories