English   

గుడిలో ఫోటోలు తీసి అడ్డంగా బుక్ అయిన హీరోయిన్..

Nivetha-Pethuraj
2019-03-23 02:58:17

గుడిలోనికి వెళ్లేటప్పుడు ఇక్కడ కెమెరాలు నిషిద్ధం.. ఫోటోలు నిషిద్ధం.. మీ ఫోన్లు స్విచాఫ్ చేసుకోండి అంటూ బోర్డులు మనకు దర్శనమిస్తాయి. వాటిని చాలామంది పట్టించుకుంటారో లేదో తెలియదు కానీ నిజంగానే గుడిలోకి ఎలక్ట్రికల్ వస్తువులు తీసుకెళ్ళకూడదని హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. మరీ ముఖ్యంగా బాగా ఫేమస్ అయిన గుడిలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు అసలు తీసుకెళ్లనివ్వరు. కానీ ఇప్పుడు ఒక హీరోయిన్ మాత్రం సెక్యూరిటీ అధికారుల కళ్లుగప్పి గుడిలోనికి కెమెరాలు తీసుకెళ్లడమే కాకుండా అక్కడ ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత అది ఓ రేంజ్ లో రచ్చ జరగడంతో వెంటనే తీసేసింది. దీనికి అన్నింటికి కారణం అయినా ముద్దుగుమ్మ పేరు నివేద పేతురాజ్. మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో పాటు బ్రోచేవారెవరురా అనే మరో సినిమాలో కూడా నటిస్తుంది. చెన్నై మధుర మీనాక్షి స్నేహితులతో పాటు వెళ్లిన ఈ భామ.. లోపలికి ఫోన్ తీసుకెళ్లడమే కాకుండా ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫిబ్రవరి 2018 నుంచి ఈ గుడిలోనికి ఎలక్ట్రానిక్ పరికరాలు నిషిద్ధం అంటూ  హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇప్పుడు ఇవన్నీ పట్టించుకోకుండా నివేదా పేతురాజ్ లోపలకి ఫోన్ తీసుకెళ్లి ఫోటోలు వీడియోలు తీసి అడ్డంగా బుక్ అయిపోయింది. దానితో ఈమెపై విమర్శల వర్షం కురిసింది. గుడిలో కెమెరా ఎలా తీసుకెళ్తారు.. నిబంధనలు తెలియదా అంటూ ఈ భామపై విరుచుకు పడుతున్నారు నెటిజన్లు. పనిలో పనిగా సామాన్య ప్రజల దగ్గర అంత కఠినంగా ఉండే సెక్యూరిటీ.. సెలబ్రిటీల దగ్గరికి వచ్చేసరికి మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు అంటూ వాళ్లకు కూడా అక్షింతలు వేశారు. మొత్తానికి ఇప్పుడు నివేదా చేసిన పనికి అందరికీ సమానంగా తిట్లు పడుతున్నాయి.

More Related Stories