English   

బన్నీ చెల్లిగా ఆమే కావాలట 

Nivetha Thomas
2019-05-25 19:32:45

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా గ్యాప్ తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బన్నీ సరసన రెండో మారు పూజ హెగ్డే నటిస్తుంది. అలానే బన్నీ తల్లి పాత్రలో సీనియర్ హీరోయిన్ ‘టబు’ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రకి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, అందుకే ఆ పాత్ర కోసం నివేదా థామస్ ను ఎంపిక చేశారనే టాక్ వినిపించింది. అయితే ఈ విషయం మీదే నివేదా థామస్ ఈ మధ్యనే స్పందించింది. ఇప్పటివరకు ఈ మూవీ కోసం తనని ఎవరూ సంప్రదించలేదని, ఈ సినిమాలో తాను చెల్లెలి పాత్రను చేయనున్నాననే వార్తలో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. నిజానికి ఈ పాత్ర కోసం చాలా మందిని అనుకున్నా ఎట్టకేలకు చిత్రబృందం నివేదా అయితేనే సరిగా నటించగలదని భావించి నివేదాను ఒప్పించే పనిలో పడిందట ఆ సినిమా యూనిట్. నిజానికి నివేదా నాని, సుధీర్ బాబుల 'వి' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉందట. మరి ఈమె బన్నీకి చెల్లిగా నటించేందుకు ఒప్పుకుంటుందా ? అనేదే ఆశ్చర్యకరంగా మారింది.

More Related Stories