English   

నిన్నుకోరి.. వ‌చ్చేసానంటోన్న నివేదా..

Nivetha-Thomas
2018-04-25 18:07:11

ఇండ‌స్ట్రీలోకి ఒక్క‌సారి వ‌చ్చిన త‌ర్వాత‌.. డ‌బ్బు సంపాదించ‌డం మొద‌లైన త‌ర్వాత ఇక చ‌దువుపై దృష్టి వెళ్ల‌దు. అంతా మ‌నీ మ‌నీ మ‌నీ అంటూ దాని వెంటే ప‌రుగులు తీస్తారు. చాలా మంది హీరోయిన్ల విష‌యంలో ఇదే జ‌రిగింది. అందుకే చ‌దువును త్యాగం చేసో.. లేదంటే పూర్తిచేసో ఇండ‌స్ట్రీకి వ‌స్తుంటారు ముద్దుగుమ్మ‌లు. కానీ కొంద‌రు మాత్ర‌మే ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌ర్వాత కూడా చ‌దువుకుంటారు. ఇప్పుడు నివేదా థామ‌స్ చేసింది కూడా ఇదే. ఈమె కొన్ని సినిమాలు చేసిన త‌ర్వాత‌.. జెంటిల్ మ‌న్, నిన్నుకోరి, జై ల‌వ‌కుశ లాంటి విజ‌యాల త‌ర్వాత మంచి రైజింగ్ లో ఉన్న‌పుడు అన్నీ వ‌దిలేసి చ‌దుకోవ‌డానికి వెళ్లింది. కొన్నాళ్లుగా ఈ భామ ఏ సినిమా ఒప్పుకోలేదు. ర‌వితేజ‌తో సినిమా అనుకున్నా కూడా దానిపై కూడా క్లారిటీ ఇవ్వ‌లేదు. ఇక శ‌ర్వానంద్ సినిమాను కూడా వ‌దిలేసింది నివేదా థామ‌స్. దానికి కార‌ణం చ‌దువుపై దృష్టి పెట్టడ‌మే. ఇప్పుడు త‌న డిగ్రీప‌ట్టా అందుకుంది ఈ ముద్దుగుమ్మ‌. దాంతో మ‌ళ్లీ సినిమాల వైపు వ‌స్తున్న‌ట్లు అనౌన్స్ చేసింది నివేదా. ఇప్పుడు అనుకున్న‌ట్లుగానే క‌ళ్యాణ్ రామ్ తో ఓ సినిమాకు సైన్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. సినిమాటోగ్ర‌ఫ‌ర్ కేవీ గుహ‌న్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారుతున్నాడు. తాజాగా ఈ చిత్ర ఓపెనింగ్ ఎన్టీఆర్ చేతుల మీదుగా జ‌రిగింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ పై మ‌హేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. మ‌రి చూడాలిక‌.. నివేదా డిగ్రీ ప‌ట్టా త‌ర్వాత ఈ భామ కెరీర్ ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories