English   

మెహబూబా.. క్రేజ్ ఎక్కడ..?

mehbooba

ఒకప్పుడు సెంచరీలు కొట్టిన బ్యాట్స్ మన్ తర్వాత కంటిన్యూస్ గా డకౌట్ అవుతూ, కొత్తగా ఏ ఇన్నింగ్స్ మొదలుపెట్టినా.. ఎవరూ పట్టించుకోరు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ పరిస్థితి ఇలాగే ఉంది. గతంలో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరీ, ఎంతోమంది హీరోల ‘డ్రీమ్ డైరెక్టర్’ గానూ మారాడు.. స్టార్ హీరోల నుంచి స్మాల్ హీరోల వరకూ పూరీ డైరెక్షన్ లో ఒక్కసారైనా నటించాలి అనుకున్నారు. కానీ మనోడు బిజినెస్ మేన్ తర్వాత గాడి తప్పాడు. మధ్యలో టెంపర్ తప్ప.. చాలాయేళ్లుగా పూరీకి హిట్ మొహం చాటేసింది. ఈ నేపథ్యంల తన కొడుకునే హీరోగా పెట్టి ఇండో పాక్ నేపథ్యంలో ప్రేమకథ అంటూ వస్తున్నాడు. మెహబూబా అనే టైటిల్ తో వస్తోన్న ఈ సినిమా ఈ నెల  11న విడుదల కాబోతోంది. అంటే ఖచ్చితంగా వారం కూడా లేదు. అయినా సినిమాకు రావాల్సినంత క్రేజ్ రాలేదు. ఇందకు కారణం పూరీ ప్రీవియస్ హిస్టరీయే అని వేరే చెప్పక్కర్లేదు. 

ఇక పూరీ తనయుడికి హీరో ఫీచర్స్ పెద్దగా లేవు. హీరోయిన్ కొత్తమ్మాయి. నేపథ్యం భారీగా ఉన్నా.. పూరీపై భారీగా అనుమానాలూ ఉన్నాయి. అయితే ట్రైలర్ తర్వాత చాలామంది మళ్లీ పూరీ మ్యాజిక్ చూపిస్తాడేమో అనుకున్నారు. బట్ అందుకు తగ్గట్టుగా బజ్ రాలేదు. మధ్యలో దిల్ రాజు ఈ సినిమాను విడుదల చేయబోతున్నాడు అనే మాట తప్ప ప్రమోషన్స్ కూడా ఆకట్టుకోవడం లేదు. మరోవైపు యూఎస్ లో కూడా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. అక్కడా సేమ్ సిట్యుయేషన్. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ కు క్రేజ్ వస్తే పూరీ రేంజ్ మారుతుంది. కానీ అలా ఏం కనిపించడం లేదు. మరోవైపు 9న విడుదల కాబోతోన్న మహానటి ప్రమోషన్స్ తో దంచేస్తోంటే.. మెహబూబా మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోతోంది. మరి ఆడియన్స్ అటెన్షన్ కోసం పూరీ ఇంకా కొత్తగా ఏం చేయబోతాడో చూడాలి.. 

More Related Stories