English   

హ‌రీష్ శంక‌ర్ కు మ‌ళ్లీ షాక్ త‌ప్ప‌దా..? 

harish-shankar
2018-05-14 09:40:28

ఇండ‌స్ట్రీలో టాలెంట్ తో పాటు ల‌క్కూ ఉండాలి. లేదంటే నిన్న‌టి స్టార్ డైరెక్ట‌ర్స్ కూడా నేటి స్మాల్ డైరెక్ట‌ర్స్ అయిపోతారు. కానీ కొంద‌రికి మ‌రీ ఆ స్మాల్ డైరెక్ట‌ర్ అన్న ట్యాగ్ కూడా దూర‌మ‌వుతూ ఉంటుంది. అలాంటి వారిలో లేటెస్ట్ గా ఫ‌స్ట్ ప్లేస్ లో ఉంటాడు హ‌రీష్ శంకర్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కే బ్రేక్ ఇచ్చిన ఈ ద‌ర్శ‌కుడుత‌ర్వాత బాక్సాఫీస్ వ‌ద్ద  ఆ స్థాయి విజ‌యాలు సాధించ‌లేక‌పోయాడు. చాలా గ్యాప్ త‌ర్వాత అల్లుఅర్జున్ చాన్స్ ఇచ్చినా.. దీన్నీ స‌రిగ్గా వాడుకోలేక‌పోయాడీ దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్. ఈ సినిమా హిట్ అనిపించినా.. అదంతా బ‌న్నీ క్రెడిట్ లో వేశారు. దీంతో హ‌రీష్ మ‌ళ్లీ క్రాస్ రోడ్స్ లోకి వ‌చ్చాడు. ఇక గ‌త కొన్నాళ్లుగా ఏదో ఒక‌స్టార్ హీరోనుప‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడుమ‌న హీరోలు క‌థ‌లు మీరారు. మంచిక‌థ‌ల‌కే ఓటు అంటున్నారు. హీరోయిజంనుఎలివేట్ చేసే క‌థ‌లైతే నో అంటున్నారు. దీంతో మామూలుగా అలాంటి క‌థ‌లేరాసుకునే హ‌రీష్ కు చుక్కెదుర‌వుతోంది. రీసెంట్ గా దాగుడుమూత‌ల దండాకోర్ అనే సినిమా చేయాల‌నుకున్న‌డు. దీనికి త‌నూ ఓ నిర్మాత‌గ మారాలనుకున్నాడు.మ‌రో నిర్మాత‌గా దిల్ రాజు ముందుకు వ‌చ్చినా.. ఇత‌న్ని హీరోలెవ‌రూ న‌మ్మ‌డం లేదు. మొద‌ట్లో ఈ దాగుడుమూత‌లు నితిన్ తో ఆడాల‌నుకున్నారు. కుద‌ర్లేదు. త‌ర్వాత శ‌ర్వానంద్ ను ఒప్పించారు. కానీ ఇప్పుడు  శ‌ర్వా ఈ సినిమా చేయాలా వ‌ద్దా అనే రీ థాట్ లో ప‌డ్డ‌ట్టు టాక్. మ‌రోవైపు అత‌నికి క‌థ పూర్తిగా న‌చ్చ‌లేద‌నీ.. దాన్ని మార్చ‌మ‌ని ద‌ర్శ‌కుడికి చెప్పినా మార్చ‌లేద‌నే కంప్లైంటూ శ‌ర్వా నుంచి వినిపిస్తోంది. అంటే ఉన్న ఒక్క హీరో కూడాహ‌రీష్ కు హ్యాండ్ ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్టే అనుకోవ‌చ్చు. 

More Related Stories