English   

సాయికి అడ్డొస్తున్న వ‌రుణ్.. 

Bellamkonda-Srinivas
2018-07-16 14:47:13

మొన్న‌టికి మొన్న చిరంజీవికి అడ్డొచ్చిన వ‌రుణ్.. ఇప్పుడు సాయికి కూడా అడ్డొస్తున్నాడు. సాయి అంటే సాయిధ‌రంతేజ్ కాదు.. సాయి శ్రీ‌నివాస్.. బెల్లంకొండ శ్రీ‌నివాస్. ఈయ‌న న‌టించిన సాక్ష్యం సినిమా ప్ర‌మోష‌న్ కు వ‌రుణ్ అడ్డొస్తున్నాడు. అంటే వ‌రుణుడు అన్న‌మాట‌. వ‌ర్షాల దెబ్బ‌తో మ‌న నిర్మాత‌లు భ‌య‌ప‌డుతున్నారు. ఏ సినిమా ఎప్పుడు ఎలా ప్ర‌మోట్ చేసుకోవాలో తెలియ‌క తిక‌మ‌క‌ప‌డుతున్నారు. హోర్డింగులు పెడితే గాలికి ఎగిరి పోతున్నాయి.. వ‌ర్షానికి అవి క‌నిపించ‌కుండాపోతున్నాయి. మ‌రోవైపు సినిమా విడుద‌ల చూస్తూ రెండు వారాలు మాత్రమే ఉంది. జులై 27న సాక్ష్యం విడుద‌ల కానుంది. ఈ రెండు వారాలు పూర్తిగా ప్ర‌మోష‌న్ కు వాడుకుందాం అనుకుంటున్న ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు వ‌ర్షాలు చుక్క‌లు చూపిస్తు న్నాయి. ఓ హోర్డింగ్.. ఓ క‌టౌట్.. ఓ పోస్ట‌ర్ ఏది పెట్టినా చిరిగిపోతుంది.. ఎగిరిపోతుంది.. క‌న‌బ‌డ‌కుండా పోతుంది. దాంతో ఇప్పుడు చెప్పుకోలేని చిక్కులు వ‌స్తున్నాయి. శ్రీ‌వాస్ తెర‌కెక్కించిన ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. 40 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ తో సాక్ష్యం సినిమాను తెర‌కెక్కించాడు ఈ ద‌ర్శ‌కుడు. పంచ‌భూతాల క‌థ‌తో ఈ చిత్రం వ‌స్తుంది. తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్ తో వ‌స్తోన్న తొలి సినిమా ఇదే. మ‌రి చూడాలి.. వ‌ర్షాల దెబ్బ‌ను కాద‌ని సాక్ష్యం విజ‌యానికి సాక్ష్యంగా నిలుస్తుందో లేదో..? 

More Related Stories