English   

అమ్మ కాలేనంటున్న హీరోయిన్.. 

Simran-mom-roles
2018-08-23 15:20:17

ఎలాంటి అమ్మాయైనా అమ్మ కావాల్సిందే. అమ్మ అయిన‌పుడే నూటికి నూరు మార్కులు ప‌డ‌తాయని అప్ప‌ట్లో ఓ సినీక‌వి కూడా చెప్పాడు. అయితే ఇప్పుడు తాను మాత్రం అమ్మ కాలేన‌ని చెబుతుంది సిమ్రాన్. ఇప్ప‌టికే పెళ్లై.. అమ్మ కూడా అయిపోయిన సిమ్రాన్.. ఇప్పుడు అమ్మ  కాక‌పోవ‌డం ఏంటి అని ఆశ్చ‌ర్య‌ప‌డుతున్నారా..? ఇక్క‌డే చిన్న క‌థ కూడా ఉంది. ఈమె అమ్మ కాను అంటుంది సినిమాల్లో. వ‌య‌సు 45 వ‌చ్చినా కూడా ఇప్ప‌టికీ త‌న‌కు అమ్మ పాత్రలు వ‌ద్దు అనే అంటుంది ఈ ముదురు గుమ్మ‌. అయినా సిమ్రాన్ అంటే తెలియ‌ని సౌత్ ప్రేక్ష‌కులు ఉండ‌రు. ఈ త‌రంకు కొత్తేమో కానీ ఒక్క త‌రం వెన‌క్కి వెళ్తే మాత్రం సిమ్రాన్ సోకుల‌కు ఇండ‌స్ట్రీ షేక్ అయిపోయింది ఒక‌ప్పుడు. స్టార్ హీరోలెవరైనా సిమ్రాన్ ఉండాల్సిందే. మిలీనియం మొద‌ట్లో ఈమె హ‌వా అలా న‌డిచింది మ‌రి. టాప్ హీరోల‌తో పాటు అప్ప‌టి కుర్ర హీరోలు మ‌హేశ్, ప్ర‌భాస్ లాంటి వాళ్ల‌తోనూ చిందేసింది సిమ్రాన్. 

ఇక ఇప్పుడు ఈమె సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొద‌లు పెట్టేసింది. అడ‌పాద‌డ‌పా చిన్న పాత్ర‌లు చేస్తూ వ‌స్తోన్న ఈ ముద్దుగుమ్మ‌.. అమ్మ పాత్ర‌లు మాత్రం చేయ‌న‌ని స్టేట్ మెంట్ ఇచ్చేసింది. కావాలంటే విల‌న్ పాత్ర‌ల‌కు అయినా స‌ద్ధ‌మే కానీ అమ్మ‌గా మాత్రం న‌టించ‌ను అని చెప్పేసింది. అన్న‌ట్లుగానే ఇప్పుడు విల‌న్ గా న‌టిస్తుంది. శివకార్తికేయన్ హీరోగా న‌టిస్తోన్న సీమ‌రాజా సినిమాలో సిమ్రాన్ విల‌న్ గా క‌నిపిస్తుంది. ఇందులో త‌న పాత్ర చాలా భిన్నంగా ఉంటుంద‌ని సిమ్రాన్ చెబుతుంది. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు పొన్ర‌మ్. స‌మంత ఇందులో హీరోయిన్. సెప్టెంబ‌ర్ 13న విడుదల కానుంది ఈ సినిమా. 

తొండ ముదిరి ఊస‌ర‌వెల్లి అయిన‌ట్లుగా.. ఇప్పుడు ముదురు హీరోలంతా విల‌న్లుగా మారిపోతున్నారు. ఇప్పుడు మీకు మేమేం తీసిపోం అన్న‌ట్లు నిన్న‌టి త‌రం హీరోయిన్లు సైతం విలన్లుగా మారిపోతున్నారు. ఆ మ‌ధ్య జ‌య జాన‌కీ నాయ‌కా సినిమాలో వాణి విశ్వ‌నాథ్ కూడా విల‌న్ గానే న‌టించింది.  ఈ లిస్ట్ లోకి ఇప్పుడు సిమ్రాన్ కూడా చేరిపోయింది. ఈ మ‌ధ్యే విశాల్ న‌టించిన తుప్పరివాల‌న్ సినిమాలో కాసేపు క‌నిపించే అతిథిగా మెరిసింది సిమ్రాన్. విక్రమ్ హీరోగా తెర‌కెక్కుతోన్న ధ్రువ నక్ష‌త్రంలోనూ సిమ్రన్‌ కీలక పాత్రలో న‌టిస్తుంది. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ తో ఈమె గతంలో ప‌నిచేసారు. ఈ కాంబినేష‌న్ లో సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్ వ‌చ్చింది. ఇప్పుడు మ‌రోసారి సిమ్రాన్ ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తుంది. మ‌రి ఒక‌ప్పుడు త‌న అందాల‌తో మ‌రిపించిన సిమ్రాన్.. ఈ కొత్త ఇన్నింగ్స్ లో ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..!

More Related Stories