English   

కమల్ హాసన్ సెన్షేషనల్ డెసిషన్ ...

kamal-politics
2018-02-15 09:56:33

కమల్ హాసన్ సినిమాలు వదిలేస్తున్నాడు.. షాక్ అయ్యారా.. కానీ ఇది నిజం. ఈ మాట కూడా రూమర్ కాదు. స్వయంగా ఆయనే చెప్పాడు. కాకపోతే సినిమాలు పూర్తిగా వదిలేయడానికి ముందు ఓ రెండు సినిమాలు వదులుతాడట. తర్వాత పూర్తిస్తాయిలో పాలిటిక్స్ లోకి ఎంటర్ కావాలని డిసైడ్ అయ్యాడు కమల్ హాసన్. కేవలం సామాజిక సేవ కోసమే తన యాభైయేళ్ల నట జీవితానికి శుభం కార్డ్ వేయబోతున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చాడు కమల్. కొన్నాళ్ల నుంచి తను పాలిటిక్స్ లోకి వస్తానంటుంటే చాలామంది మరీ సీరియస్ అనుకోలేదు. కానీ సీన్ ఇంత సీరియస్ అని రీసెంట్ గా ఆయన ఓ ఇంటర్వ్యూస్ లో అనౌన్స్ చేసే వరకూ తెలియలేదు. మొత్తంగా ఈ ఇంటర్వ్యూలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలే చెప్పాడు కమల్..

ఈ మధ్య కమల్ ను హిందువులు బాగా టార్గెట్ చేస్తున్నారు. అయితే తనకు హిందువులంటే ద్వేషం లేదని చెప్పాడు. ఇన్నేళ్లుగా తాను సోషల్ సర్వీస్ లో ఉన్నానని.. తద్వారా దాదాపు పదిలక్షలమంది సామాజిక కార్యకర్తలను తయార చేశానని చెప్పాడు. వీరిలో 250మందికి పైగా లాయర్లు కూడా ఉన్నారట. వీరు కూడా తమ తర్వాతి తరాన్ని ఈ సోషల్ సర్వీస్ లో భాగంగా చేశారట. ఇప్పుడు తను పెట్టబోయే పార్టీకి వీళ్లే తొలి మద్ధతుదారులు కాబోతున్నారని చెప్పాడు కమల్. ఈ నెల 21న కమల్ హాసన్ పార్టీని ప్రకటించబోతున్నాడు. అదే వేదికపై తన పార్టీ విధి విధానాలను కూడా ప్రకటించబోతున్నాడు. అదే సమయంలో అటు రజినీకాంత్ కూడా పార్టీ విధివిధానాలు ప్రకటిస్తాడు. అవి చూసిన తర్వాత తన పార్టీకి దగ్గరగా ఆయన విధానాలు ఉంటే కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదని తేల్చేశాడు. ఒకవేళ రజినీ బిజేపి ముసుగులో ఉంటే ఆయనతో అస్సలు కలవనని చెప్పాడు. 

భారత్ ఇలా ఉండాలని తనకో డ్రీమ్ ఉందని.. తన తపన ఆ డ్రీమ్ ను తయారు చేయడం కోసమే అని చెప్పాడు. ఈ క్రమంలో ఎదురయ్యే అన్ని సవాళ్లు ఫేస్ చేసే ధైర్యం తనకుందని తేల్చాడు. తన పార్టీ సిద్ధాంతాలు కూడా మెరుగైన భారత్ లక్ష్యంగా ఉంటాయని చెప్పాడు. ఇవన్నీ చేయాలంటే సినిమాల్లో ఉంటూ చేయడం సాధ్యం కాదు. అందుకే ఇకపై వెండితెరకు గుడ్ బై చెప్పబోతున్నానని ప్రకటించాడు. ప్రస్తుతం ఆల్రెడీ కమిట్ అయిన రెండు సినిమాలున్నాయి. అవే నా చివరి సినిమాలనీ స్పష్టంగా తేల్చాడు. ఇవన్నీ కమల్ హాసన్ లేటెస్ట్ గా అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలో చేసిన ప్రసంగంలో తెలియజేసిన విషయాలు. ఏదేమైనా ఈ మహానటుడి వెండితెర నిష్క్రమణం ఎంతోమంది అభిమానుల్ని కలచివేసేదే. కానీ ఆయన సిద్ధాంతం ప్రజల కోసమే అంటున్నాడు కాబట్టి.. ఆ దిశగానూ అద్భుతమైన ఫలితాలు సాధించాలని కోరుకుందాం. 

More Related Stories