English   

వినాయ‌క్ ను వ‌దిలేసారా.. వ‌దిలేస్తున్నాడా..? 

vinayak

ఏమో ఇదే అర్థం కావ‌డం లేదు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో. ఈయ‌న్ని వదిలేస్తున్నారా.. లేదంటే ఈయ‌న వ‌దిలేస్తున్నాడా అనేది క్లారిటీ రావ‌డం లేదు. మ‌రీ ఎంత డిజాస్ట‌ర్లు ఇచ్చినా కూడా ఒక్క ఆఫ‌ర్ కు కూడా నోచుకోలేనంత దారుణ‌మైన ద‌ర్శ‌కుడు అయితే వినాయ‌క్ కాదు. క‌చ్చితంగా ఫ్లాప్ సినిమా వ‌చ్చినా కూడా వినాయ‌క్ తో సినిమా చేయ‌డానికి ఇప్ప‌టికీ ఎవ‌రో ఓ హీరో సిద్ధంగానే ఉంటాడు. కానీ ఇంటిలిజెంట్ త‌ర్వాత అస‌లు వివి వినాయ‌క్ నెక్ట్స్ సినిమాపై ఇంత కూడా టాక్స్ వినిపించ‌డం లేదు. ఈయ‌న సినిమాలు చేస్తాడా చేయ‌డా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయి ఇప్పుడు. ఆ మ‌ధ్య ఇంటిలిజెంట్ ఆడియో విడుద‌ల వేడుక జ‌రిగిన తీరు చూస్తే ఈయ‌న రాజ‌కీయాల్లోకి వెళ్లినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం చూస్తుంటే వినాయ‌క్ ఇప్ప‌ట్లో సినిమాలు చేసే మూడ్ లో లేన‌ట్లు తెలుస్తుంది. సాయిధ‌రంతేజ్ సినిమాను కూడా పెద్ద‌గా ఆస‌క్తి లేకుండానే పూర్తి చేసాడు వినాయ‌క్. ఊహించ‌ని విధంగా ఈ చిత్రాన్ని కేవ‌లం 45 రోజ‌ల్లోనే తెర‌కెక్కించాడు. ఇదే సినిమా కొంప ముంచిందేమో అనిపిస్తుంది. ఆకుల శివ ఇచ్చిందే ప్ర‌సాదంగా ఏవేవో సీన్స్ పెట్టేసాడు వినాయ‌క్. ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడి ఇమేజ్ త‌గ్గించేసింది. నెక్ట్స్ ఏం చేయ‌బోతున్నాడ‌నే అనే ఆస‌క్తి రెండింత‌లు చేసింది. ఇప్ప‌టికైతే ఎన్టీఆర్ తో అదుర్స్ 2 చేస్తాన‌ని అనౌన్స్ చేసాడు. మ‌రి చేస్తాడో.. లేదంటే వినాయ‌క్ ఇప్పుడున్న ఫామ్ చూసి ఎన్టీఆరే వ‌ద్దంటాడో మాత్రం తెలియ‌డం లేదు. మొత్తానికి చూడాలిక‌.. వినాయ‌క్ త‌ర్వాతి సినిమా ఎలా ఉండ‌బోతుందో.. ఎవ‌రితో ఉండ‌బోతుందో..?         
 

More Related Stories