English   

రకుల్ రేంజ్ పడిపోయినట్టేనా..?

Rakul Preet Singh

చిన్న సినిమాలతో మొదలుపెట్టి మెల్లగా విజయాలు అందుకుంటూ స్టార్ హీరోల వరకూ వచ్చిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్స్ సరసన నటించిన రకుల్ కు గతేడాది మిక్స్ డ్ రిజల్ట్ వచ్చింది. వీటిలో ఆమె యాక్టింగ్ కు కూడా పెద్దగా మార్కులు పడలేదు. దీంతో ఇప్పుడు తెలుగులో ఒక్క చాన్స్ కూడా లేదు. అటు బాలీవుడ్ లో చేసిన అయ్యారీ సినిమాకూ హిట్ టాక్ రాలేదు. బాలీవుడ్ సినిమాపై రకుల్ చాలా ఆశలే పెట్టుకుంది. అందుకోసం ఏకంగా టూ హాట్ గా ఫోటో షూట్స్ కూడా చేసింది. అయినా ఆ మూవీ ఆశించిన రిజల్ట్ ఇచ్చేలా లేదు. ప్రస్తుతం అజయ్ దేవ్ గణ్ సినిమాలో నటిస్తోంది. ఇక తెలుగులో ఆఫర్స్ లేవు కాబట్టి తమిళ్ లో లక్ చేసుకునేందుకు వెళ్లింది. అక్కడా అదే రిపీట్ అయింది. ప్రస్తుతం సూర్య హీరోగా నటిస్తోన్న సినిమాలో తను రెండో హీరోయిన్ గా చేస్తోంది. మెయిన్ హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తోంది. ఇదే తన రేంజ్ ను తగ్గించందంటే ఇప్పుడు మరో చిన్న హీరోతో జోడీ కట్టి తగ్గిన తన రేంజ్ ను తనే చూపిస్తోంది. 

తమిళ్ లో సెకండ్ గ్రేగ్ హీరోస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో శివకార్తికేయన్. మనోడికి టాలెంట్ ఉంది కానీ పెద్ద స్టార్ రేంజ్ కాదు. అతని సరసన హీరోయిన్ గా చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. శివకార్తికేయన్ రీసెంట్ గా వేలైక్కారణ్ అనే సినిమాతో హిట్ కొట్టాడు. ప్రస్తుతం రవికుమార్ అనే డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు. ‘సీమరాజా’ అనేది ఈ మూవీ టైటిల్. ఇందులో హీరోయిన్ పాత్రకు మంచి స్కోప్ ఉంటుందట. అందుకే తనను అప్రోచ్ అయ్యానన్నాడు దర్శకుడు. తను ఓకే అందట. అయినా ఓకే అనకుండా ఉంటుందా.. అటు బాలీవుడ్ ఆశలు గల్లంతయ్యాయి. ఇటు తెలుగులో ఒక్క ఆఫరూ లేదు. ఈ టైమ్ లో కనీసం లైమ్ లైట్ లో ఉండాలంటే చిన్నదో పెద్దదో ఏదో ఒక సినిమా అయితే చేయాలి కదా.. మొత్తంగా రకుల్ ప్రభ తగ్గిపోతోందనడానికి తనిప్పుడు చేస్తోన్న సినిమాలే నిదర్శనం.

More Related Stories