English   

ఆర్ఎక్స్ 100 హీరోను ఎవరూ పట్టించుకోవడం లేదా..?

Karthikeya-rx-100
2018-08-11 15:41:18

కొత్తవాళ్లు తీసిన ఓ సినిమా హిట్ అయితే దర్శకుడుకి వచ్చినన్ని ఆఫర్స్ ఆ సినిమాలో నటించినవారికి రావు. ఏ కొన్నిసార్లో తప్ప అలా జరగదు. ఈ మధ్య అలా ఫస్ట్ మూవీతోనే బెస్ట్ ఆఫర్స్ కొట్టిన హీరోల్లో విజయ్ దేవరకొండ ఉన్నాడు. అనుకోకుండా పడిన అర్జున్ రెడ్డి అతన్ని ఓ రేంజ్ కు తీసుకువెళ్లింది. అయితే రెండో సినిమాతో అర్జున్ రెడ్డి తరహా సినిమాగా అనిపించుకున్న కార్తికేయ కు మాత్రం అలా జరగడం లేదు. అతను హీరోగా నటించిన రెండో సినిమా ఆర్ఎక్స్ హండ్రెడ్ ప్రాఫిట్స్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అతనికీ హీరోగా మంచి పేరొచ్చింది. నటనకూ మంచి మార్కులు పడ్డాయి. ఇక దర్శకుడికైతే ఆఫర్స్ వెల్లువెత్తాయి. అటు కోలీవుడ్ నుంచి ఏకంగా ధనుష్ కాల్ చేసి పిలిపించి మరీ మాట్లాడాడు. ఇక్కడా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి అడ్వాన్స్ లు ఇచ్చేందుకు పోటీపడ్డారు నిర్మాతలు. అలాంటి ఈ హీరోకు మాత్రం ఇంత వరకూ కొత్త సినిమా అనౌన్స్ కాలేదు. అసలు ఏం చేస్తున్నాడన్న విషయంలోనూ క్లారిటీ రాలేదు.

కార్తికేయ మంచి హీరో మెటీరియల్.. చాలా పాత్రలకు ఈజీగా సరిపోయే బాడీషేప్ కూడా ఉంది. లవర్ బాయ్ అయినా.. కాస్త మాస్ టచ్ ఉన్న పాత్రైనా ఇట్టే ఒదిగిపోగలడు అనిపించుకున్నాడు. ఫస్ట్ మూవీ ప్రేమతో మీ కార్తికేయ వంటి సినిమాతో అరంగేట్రం చేసిన కార్తికేయ రెండో సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. మామూలుగా అయితే కార్తికేయ టాలెంట్ కు ఇప్పటికే రెండు మూడు ప్రాజెక్టులు అనౌన్స్ కావాలి. కానీ అలా జరగడం లేదు. లేదంటే అతనే ఇంకా అనౌన్స్ చేయడం లేదా అనేది తెలియదు కానీ.. కుర్రాడు ఈ మధ్య పబ్లిక్ ఫంక్షన్స్ లో కూడా బాగా కనిపిస్తున్నాడు. కానీ కొత్త సినిమా యవ్వారమే తేలడం లేదు. 

More Related Stories