English   

అనారోగ్య కారణం వల్ల నోయల్ ఔట్

 Noel Sean
2020-10-30 15:27:34

బిగ్ బాస్ సీజన్-4 మొదట్లో మంచి రేటింగ్ తో సక్సెస్ ఫుల్ గా నడిచింది. అయితే ఇప్పుడు రేటింగ్ దారుణంగా పడిపోయినట్టు తెలుస్తోంది. దానికి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక కారణం కాగా మరో కారణం హోస్ట్ అంటూ నగార్జునపై కూడా విమర్శలు వస్తున్నాయి. నాగార్జున సరిగ్గా హోస్టింగ్ చేయట్లేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక గంగవ్వ అనారోగ్యం కారణంగా హౌస్ నుండి భయటకు వెళ్లడం కూడా బిగ్ బాస్ కు కొంత మైనస్ అయిందని చెప్పవచ్చు.బిగ్ బాస్ లో గంగవ్వ ఎంట్రీతో ఇంట్లో పెద్దవాళ్ళు కూడా బిగ్ బాస్ కి అలవాటు పడ్డారు. కానీ గంగవ్వ భయటకు వెళ్లడంతో వాళ్ళు కూడా బిగ్ బాస్ కి గుడ్ బై చెప్పారు. ఇక ఇప్పడు హౌస్ నుండి మరో కంటెస్టెంట్ సింగర్ నోయల్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరాడు. నోయల్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుండి కొంత అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే నోయల్ ఆరోగ్యం ప్రస్తుతం మరింత క్షీణించినట్టు కనిపిస్తోంది. దాంతో నోయల్ ను బిగ్ బాస్ చికిత్స కోసం ఆస్పత్రికి పంపించాడు. అంతే కాకుండా పూర్తి ఆరోగ్యంతో తిరిగిరావాలని బిగ్ బాస్ కోరుకుంటున్నారు అని తెలిపారు. దాంతో నోయల్ హౌస్ లోకి వస్తాడని కన్ఫామ్ అయ్యింది.

More Related Stories