English   

ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ కన్ఫర్మ్.. ప్రాజెక్ట్‌లోకి కళ్యాణ్ రామ్ ఎంట్రీ..

ntr
2020-02-19 19:18:45

అల వైకుంఠపురములో సినిమా సక్సెస్ తో కొండంత కాన్పిడెన్స్ తో కనిపిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ టాస్క్ తీసుకుంటున్నాడు. రాజమౌళి తర్వాత ఆ హీరోతో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు భయపడుతుంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ హీరో కూడా రాజమౌళితో సినిమా చేసిన వెంటనే మరో దర్శకుడితో హిట్ అందుకోలేకపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ అయితే మూడు సార్లు మూడు విజయాలు అందుకుని.. ఆ వెంటనే మూడు డిజాస్టర్స్ కూడా ఇచ్చాడు. అయితే ఇప్పుడు అలాంటి సీన్ రిపీట్ కాకుండా చరిత్రను తిరగరాయడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ వస్తున్నాడు. జూనియర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం వచ్చిన ఆర్నెళ్లలోనే త్రివిక్రమ్ సినిమా కూడా విడుదల కానుంది. చాలా రోజుల నుంచి వార్తల్లో ఉన్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. ఈ చిత్రానికి కూడా అ అనే అక్షరంతోనే టైటిల్ పెట్టాడు మాటల మాంత్రికుడు. అతడు, అత్తారింటికి దారేది, అ..ఆ, అజ్ఞాతవాసి.

. ఈ మధ్యే అల వైకుంఠపురములో ఇలా చాలా సినిమాలకు అ తోనే తన టైటిల్స్ మొదలుపెట్టాడు మాటల మాంత్రికుడు. త్వరలోనే ఈయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు 'అయిననూ పోయిరావలె.. హస్తినకు' అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడని ప్రచారం జరుగుతుంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అ అనే అక్షరంతో టైటిల్ మొదలైంది కాబట్టి కచ్చితంగా ఇది నిజమే అంటున్నారు గురూజీ అభిమానులు. రాజమౌళి తర్వాత సినిమా చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ త్రివిక్రమ్ మాత్రం చరిత్రను మార్చేస్తానంటున్నాడు. కళ్యాణ్ రామ్ ఈ చిత్రానికి మరో నిర్మాతగా ఉన్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ లో ఈ సినిమా వస్తుంది. సమ్మర్ 2021లో విడుదల కానుంది.

More Related Stories