English   

ఎన్టీఆర్ టైటిల్ లో స్మాల్ ఛేంజ్

ntr-title
2018-05-19 15:02:02

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న టైటిల్ అరవింద సమేత రాఘవ అని ఇప్పటి వరకూ వినిపించింది. కానీ ఈ టైటిల్ లో చిన్న చేంజ్ ఉంది. అఫ్ కోర్స్ చేంజ్ అంటే చేంజ్ కాదు.. అదే అసలు టైటిల్. ‘అరవింద సమేత వీర రాఘవ’ అనేది అసలు టైటిల్. ఈ రోజు సాయంత్రం 4.50నిమిషాలకు ఈ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి ముందు ఈ సినిమాకు అసామాన్యుడు అనే టైటిల్ అనుకున్నారు. కానీ చాలా వద్దని వారించారట. దీంతో ‘అరవింద ఆంజనేయ పుత్ర’ అని కూడా అనుకున్నారు. ఇది మరీ దారుణంగా ఉందనే సరికి.. ఫైనల్ గా ‘అరవింద సమేత వీర రాఘవ’కు ఓటేశారు. ఈ టైటిల్ అరవింద అనేది అత్తారింటికి దారేదీ ఫాంట్ లో ఉండబోతోంది. 

ఇక ఎన్టీఆర్ లుక్ కు సంబంధించిన చిన్నపాటి షాకే ఇవ్వబోతోంది టీమ్. యస్.. యంగ్ టైగర్ స్టిల్ ను షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ లో చూపించబోతున్నారు. టెంపర్ తర్వాత ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ చేసిన సినిమా ఇదే. అయితే ఫస్ట్ లుక్ తోనే సిక్స్ ప్యాక్ ను రివీల్ చేస్తుండటం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది. ఇక సరిగ్గా 4.50గంటలకు విడుదల కాబోతోన్న ఈ లుక్ కోసం ఎంతోమంది అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. 

More Related Stories