English   

రాజ‌మౌళి సినిమాలో విల‌న్ ఎవ‌రంటే..? 

NTR-Rajamouli

రాజ‌మౌళి సినిమా అంటే హీరోతో పాటు విల‌న్ కు అదే ఇమేజ్ ఉంటుంది. ఆ సినిమాలో విల‌న్ ఎవ‌రో అని ముందు నుంచి ఆస‌క్తి ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే హీరో కంటే రెండు ఆకులు ఎక్కువే చూపిస్తాడు విల‌న్ ను. ఆ త‌ర్వాత చివ‌ర్లో ఆ విల‌న్ ను హీరో కొడుకుంటే వ‌చ్చే మ‌జానే వేరు. ఎప్పుడూ రాజ‌మౌళి చేసేది అదే. ఇప్పుడు కూడా ఈయ‌న ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ద‌ర్శ‌కుడు చేయ‌లేని సాహ‌సం చేస్తున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. చ‌ర‌ణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ ను హీరోలుగా తీసుకుని మ‌ల్టీస్టార‌ర్ చేయ‌డం అంటే మాట‌లు కాదు. కానీ చేస్తు న్నాడు రాజ‌మౌళి. చేసి చూపించ‌డానికి రెడీ అవుతున్నాడు. 

మ‌రోవైపు రాజ‌మౌళి కూడా ఈ మ‌ల్టీస్టార‌ర్ కోసం ప‌క్కా ప్లానింగ్ సిద్ధం చేసుకుంటున్నాడు. రాజమౌళి త‌న టీమ్ రెండు ముక్కలుగా విడకొట్టి ఓ భాగం చ‌ర‌ణ్ కోసం.. మ‌రోభాగం ఎన్టీఆర్ కోసం ప‌గ‌లూ రాత్రి ప‌ని చేయ‌బోతున్నాయి. ఇందులో చ‌ర‌ణ్, ఎన్టీఆర్ మ‌ధ్య అద్భుత‌మైన స‌న్నివేశాలు రాయాలంటూ ఇప్ప‌టికే త‌న టీంను రాజ‌మౌళి కోరిన‌ట్లు తెలుస్తుంది. ఒక్క‌సారి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కథ సిద్ధం చేయ‌డం పూర్తైపోతే.. స్క్రీన్ ప్లే ప‌నిలో బిజీ కానున్నాడు రాజ‌మౌళి. అక్టోబ‌ర్ నుంచి ఈ సినిమా మొద‌లు కానుంది. షూటింగ్ మొద‌లుపెట్టే ముందే.. చ‌ర‌ణ్, ఎన్టీఆర్ పై టెస్ట్ క‌ట్ కూడా చేయ‌బోతున్నాడు రాజ‌మౌళి. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్, చ‌ర‌ణ్ అన్నాద‌మ్ములుగా న‌టిస్తార‌ని.. అందులో ఎన్టీఆర్ కు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఉంద‌ని తెలుస్తుంది. ఈ మ‌ధ్యే జై ల‌వ‌కుశ‌లో విల‌న్ గా ర‌ప్ఫాడించాడు ఎన్టీఆర్. ఇదే న‌మ్మ‌కంతో మ‌రోసారి అలాంటి పాత్ర‌నే చేయిస్తున్నాడు జ‌క్క‌న‌. ఈయ‌న‌పై న‌మ్మ‌కంతో ఎన్టీఆర్ కూడా ఏమీ మాట్లాడటం లేద‌ని తెలుస్తుంది. 

ఇన్నాళ్లు ఈ సినిమా బడ్జెట్ 150 కోట్ల‌పైనే ఉంటుంద‌ని వార్త‌లొస్తున్నాయి. ఇది ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అని తెలుస్తుంది. అంతేకాదు.. ఈ చిత్రం కోసం హీరోలిద్ద‌రూ రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డం లేదు. కేవ‌లం కోటా మాత్ర‌మే తీసుకుంటున్నారు. ఇక రాజ‌మౌళి అయితే ఈ చిత్రంతో ఏకంగా 100 కోట్ల‌కు పైగానే ప్యాకేజ్ తీసుకుంటున్నాడ‌ని తెలుస్తుంది. ఎలాగూ ఈయ‌న‌ సినిమా అంటే హాట్ కేక్ క‌దా. 2020లో సినిమా విడుద‌ల కానుంది. మ‌రి ఎన్టీఆర్ తో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయించి.. చ‌ర‌ణ్ కు పాజిటివ్ ఇస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా..? ఏమో రాజ‌మౌళి ఏదైనా చేయ‌గ‌ల‌డు. మ‌రి చూడాలిక‌.. ఏం చేస్తాడో..? 

More Related Stories