English   

‘అసామాన్యుడు’గా యంగ్ టైగర్..

NTR-ASamanyudu
2018-05-07 09:22:40

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకు ‘అసామాన్యుడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మామూలుగా ఇలాంటి తెలుగు పదాలతో టైటిల్స్ పెట్టడం త్రివిక్రమ్ స్టైల్. ఇక కథన బట్టే కాక, ఎన్టీఆర్ ఇమేజ్ ను బట్టి చూసినా అసామాన్యుడు నిజంగా సూపర్ టైటిల్. కాకపోతే నేటి యూత్ కు ఇలాంటి టైటిల్స్ ఎక్కుతాయా అనేదే డౌట్. అయితే ఈ సినిమాకు సంబంధించి గతంలోనూ ఇలాంటి టైటిల్స్ చాలా వినిపించాయి. మరి వీటిలో దేన్ని ఫైనల్ చేస్తారో కానీ.. ఈ టైటిల్ పై యూనిట్ మొత్తంగా ఇంట్రెస్టింగ్ గా ఉందని టాక్. ఇక పూగా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయినట్టు చెబుతున్నారు. దసరాకు విడుదల చేయాలని చాలా వేగంగా షూటింగ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో తన పాత్రను బట్టి ఫిజిక్ మొత్తం మార్చుకున్నాడు యంగ్ టైగర్. భీకరమైన వర్కువుట్స్ చేసి చాలా వరకూ పర్ఫక్ట్ ఫిట్ గా మారాడు. ఎన్టీఆర్ ఇంతకు ముందు ఎప్పుడూ ఏ సినిమాలోనూ ఇంత ఫిట్ గా కనిపించలేదు. మొన్న మహానటి ఆడియో ఫంక్షన్ కు వచ్చినప్పుడే చాలామంది ఎన్టీఆర్ అవుట్ ఫిట్స్ ను చూసి ఆశ్చర్యపోయారు. మరి ఈ ఫిజిక్ సినిమాకు ఎంత వరకూ ఉపయోగపడుతుందో చూడాలి. 

More Related Stories