English   

ఇండిపెండెన్స్ డే.. న్యూ పోస్టర్స్ డే

Antariksham9000kmph-first- look,
2018-08-16 10:06:37

ఈ రోజు స్వాతంత్ర్యం వచ్చిన రోజు. దేశమంతా సంబురాల్లో మునిగి తేలుతోంది. ఈ సందర్భంలో సినిమా వారు కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతులు పంచేందుకు ప్రయత్నం చేస్తారు. ఎన్టీఆర్ టీజర్ విడుదల చేస్తే.. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి ఓ లుక్ ను రిలీజ్ చేశారు. అలాగే రవితేజ, వరుణ్ తేజ్ లు కూడా తమ కొత్త సినిమాల టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. 
 
మహానటుడు నందమూరి బాలయ్య బయోపిక్ గా తెరకెక్కుతోన్న సినిమా ‘ఎన్టీఆర్’. బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తున్నాడు. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై రోజురోజుకు అంచనాలు పెంచుతున్నారు. భారీ తారాగణం కూడా నటిస్తోన్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ఎన్టీఆర్ పొలిటికల్ గెటప్ లో ఉన్న బాలయ్య ఫోటో విడుదల చేశారు. చూడగానే వావ్ అనేలా ఉన్న ఈ స్టిల్ నందమూరి ఫ్యాన్స్ లో కొత్త జోష్ తెచ్చింది. ఇక ఘాజీతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి కొత్త సినిమా అంతరిక్షం నేపథ్యంతో తీస్తున్నాడు. అంతా ఊహించినట్టుగానే ఈ సినిమాకు అంతరిక్షం అనే టైటిల్ నే కన్ఫార్మ్ చేశారు. ఇవాళ ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.. వరుణ్ తేజ్ స్పేస్ రాకెట్ లో ప్రయాణిస్తున్నట్టుగా ఉన్న ఈ స్టిల్ సింప్లీ సూపర్బ్ అనిపించుకుంటోంది. 

మాస్ మహరాజ్ రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ అమర్ అక్బర్ ఆంటోనీ టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ట్రైయాంగిల్ ఆకారంలో కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ టైటిల్ లోగో. అలాగే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన మణికర్ణిక ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో కంగనా ఝాన్సీ లక్ష్మీ బాయ్ గా నటిస్తోంది. మనం రెగ్యులర్ గా పుస్తకాల్లో చూసే లుక్ నే ఇవాళ విడుదల చేశారు. మొత్తంగా ఈ ఇండిపెండెన్స్ డే ను ఫస్ట్ లుక్స్ డే గా మార్చారు మనాళ్లు..

More Related Stories