English   

పెద్దాయ‌న పోస్ట‌ర్ అదిరింది.. 

NTR-Biopic
2018-03-27 14:41:45

పెద్దాయ‌న అంటే ఇక్క‌డ నంద‌మూరి తారక రామారావు అని. తెలుగు వాళ్లంతా అన్న‌గారు అని ఆప్యాయంగా పిలుచుకునే పేరు ఇది. ఇప్పుడు ఈ మ‌హానుభావుడి జీవితంపై సినిమా వ‌స్తుంది. అస‌లు ఎన్టీఆర్ జీవితంపై ఇన్నాళ్లూ ఒక్క సినిమా కూడా రాక‌పోవ‌డ‌మే ఆశ్చ‌ర్యం. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు బాల‌య్యే దీనికి ముహూర్తం పెట్టాడు. మార్చ్ 29న ఎన్టీఆర్ బ‌యోపిక్ ను ప్రారంభిస్తామ‌ని చెప్పాడు బాల‌య్య‌. అది కూడా హైదరాబాద్ రామకృష్ణ సినీ స్టూడియోలో సినిమా మొద‌ల‌వుతుంద‌ని చెప్పాడు ఈ నంద‌మూరి వార‌సుడు. ఎందుకంటే ఎన్టీఆర్ కు ఈ స్టూడియో చాలా అంటే చాలా ప్ర‌త్యేకం. అందుకే అక్క‌డే తండ్రి సినిమాకు ముహూర్తం పెట్టాల‌ని ఫిక్స్ అయ్యాడు బాల‌య్య‌. ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు బాల‌కృష్ణ‌. ఎన్టీఆర్ సినిమా ఎన్నికల సందర్భంగా తీసే సినిమా కాదని.. దీన్ని 2019 సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నాం అని చెప్పాడు బాల‌య్య‌. ఈ సినిమా టైటిల్ కోసం చాలా మంది చాలా పేర్లు సూచించినా ఎన్టీఆర్ ను మించిన మంచి పేరు లేదని భావించి ఆ పేరే ఖరారు చేసామ‌ని చెప్పాడు బాల‌య్య‌. పార్టీలకు అతీతంగా అందరూ ఎన్టీఆర్ ని అభినందించిన వారే కాబ‌ట్టి త‌మ సినిమా అంద‌ర్నీ అల‌రిస్తుంద‌ని చెప్పాడు బాల‌య్య‌. ఈ చిత్రానికి తేజ ద‌ర్శ‌కుడు. ఆగ‌స్ట్ లో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. ఈ చిత్రంలో మిగిలిన క్యాస్టింగ్ ఎవ‌రు అనేది ఇంకా కన్ఫ‌ర్మ్ కాలేదు. మొత్తానికి చూడాలిక‌.. ఎన్టీఆర్ గా బాల‌య్య ఎలా ఉండ‌బోతున్నాడో.. ?
 

More Related Stories