English   

ఎన్టీఆర్ బర్త్ డే పోస్టర్ వచ్చేసింది

ntr-birthday
2018-05-17 07:06:21

మే20.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు పండగ రోజు. ఎన్టీఆర్ బర్డ్ డే కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అప్పుడే అభిమానుల్లో ఓ కొత్త జోష్ మొదలైంది. వారికోసం ప్రత్యేకంగా ఓ పోస్టర్ కూడా చేయించారు. అంటే కామన్ డిపి అన్నమాట. ఎర్రటి కుర్చీలో నల్లటి దుస్తులతో రాజసం ఉట్టిపడుతుండగా కూర్చుని ఉన్న ఎన్టీఆర్ ఫోటోను అతని బర్డ్ డే పోస్టర్స్ కు కామన్ డిపిగా డిసైడ్ చేశారు. ఆ రోజున ఈ ఫోటోతోనే ఎక్కువగా బ్యానర్స్ అయినా ఫ్లెక్సీలైనా వెలుస్తాయన్నమాట. ఈ బర్త్డ్ డే నాడు ఎన్టీఆర్ అభిమానులకే కాదు.. ఎన్టీఆర్ కూ ఓ సర్ ప్రైజ్ రాబోతోందనే టాక్ వినిపిస్తోంది.  ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆ తర్వాత మొదలయ్యే రాజమౌళి సినిమాకు సంబంధించి కూడా ఓ ప్రత్యేకమైన వీడియో రెడీ చేశారట. ఆ సినిమా ఇంకా ప్రారంభం కాలేదు. అయినా తారక్ పై తనకున్న అభిమానం కొద్దీ జక్కన్న ఈ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు టాక్. ఇది ఎన్టీఆర్ కు బర్త్ డే గిఫ్ట్. దీంతో కలిపి త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మరోటిగా ఫ్యాన్స్ కు డబుల్ గిఫ్ట్స్ అనుకోవచ్చు. 

 

More Related Stories