English   

ఢీ 10.. ఎన్టీఆర్ ప్రోమో పిచ్చెక్కించారు.. !!

ntr in dhee10
2018-07-04 20:33:42

డాన్సింగ్ షోస్ లో తెలుగులో కొత్త స్టాండ‌ర్డ్స్ సెట్ చేసిన షో ఢీ. ఈటీవీలో వ‌చ్చే ఈ కార్య‌క్ర‌మానికి మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో టాప్ కొరియోగ్ర‌ఫ‌ర్స్ గా ఉన్న చాలా మంది ఈ ప్రోగ్రామ్ నుంచి వ‌చ్చిన వాళ్లే. శేఖ‌ర్ మాస్ట‌ర్ కూడా ఈ స్కూల్ నుంచి వ‌చ్చిన‌వాడే. ఇప్పుడు ఈ ఢీ 10 సీజ‌న్ న‌డుస్తుంది. ఈ ఫైన‌ల్ కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌స్తున్నాడు.

దీనికి సంబంధించిన షూటింగ్ రెండు వారాల ముందే పూర్త‌యింది. తాజాగా ఈ ప్రోమో విడుద‌లైంది. సింహాల గెట‌ప్ లో ఉన్న వాళ్ల మ‌ధ్య నుంచి జూనియ‌ర్ నిజంగానే సింహంగానే వ‌చ్చాడు. అత‌డి న‌వ్వు.. రూపం.. హావ‌భావాలు అన్నీ ప్రోమోలో అదిరిపోయాయి. ఈ ఒక్క ప్రోమోతోనే ఢీ 10 ఫైన‌ల్ పై ఎక్క‌డ‌లేని ఆస‌క్తి మొద‌లైంది. గ‌తంలోనూ ఢీ ఫైన‌ల్స్ కు ప్ర‌భాస్.. అల్లుఅర్జున్.. ప్ర‌భు దేవా లాంటి వాళ్లు వ‌చ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ వంతు. మ‌రి ఇదెలా ఉండ‌బోతుందో..? 

More Related Stories