English   

విద్యాబాల‌న్ కు ఎన్టీఆర్ కుటుంబం స్వాగతం.. 

NTR-Vidya-Balan
2018-07-18 15:32:18

బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాల‌న్ ఎన్టీఆర్ బ‌యోపిక్ షూటింగ్ లో పాల్గొంటుంది. ప్ర‌స్తుతం ఈమె హైద‌రాబాద్ లోనే ఉంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసారు విద్యాబాల‌న్. ఎన్టీఆర్ పెద్ద‌కూతురు లోకేశ్వ‌రి విద్యాబాల‌న్ కు సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన చీర‌ను బ‌హూక‌రించారు. ఇది ఎన్టీఆర్ గారు ఉన్న‌ప్ప‌టి నుంచి వ‌స్తోన్న సంప్ర‌దాయం. త‌మ ఇంటికి వ‌చ్చిన ఆడ‌ప‌డుచుకు చీర‌ను బ‌హూక‌రించ‌డం ఆన‌వాయితీ. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో న‌టిస్తున్నారు విద్యాబాల‌న్. ఈ పాత్ర‌కు సంబంధించిన వివ‌రాలు.. బ‌స‌వ‌స‌తార‌కం గారి హావ‌భావాలు, ఆమె న‌డ‌వ‌డిక‌ల‌ను ఎన్టీఆర్ పెద్ద‌కూతురు లోకేశ్వ‌రిని అడిగి తెలుసుకున్నారు విద్యాబాల‌న్.  అలాగే బ‌స‌వ‌తార‌కం గారి అల‌వాట్ల‌ను కూడా విద్యా తెలుసుకున్నారు. బాల‌కృష్ణతో పాటు ఆయ‌న స‌తీమ‌ణి వ‌సుంధ‌ర దేవి.. చిన్న‌కూతురు తేజ‌స్విని.. ఆమె భ‌ర్త భ‌ర‌త్ కూడా విద్యాబాల‌న్ తో పాటే ఉన్నారు. ఇప్ప‌టికే ఎన్టీఆర్ బ‌యోపిక్ షూటింగ్ లో విద్యాబాల‌న్ అడుగు పెట్టారు. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్ర‌త్యేకంగా నిర్మించిన సెట్ల‌లో ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కొత్త లుక్ లో క‌నిపిస్తున్నారు విద్యాబాల‌న్. సాయి కొర్ర‌పాటి, విష్ణు ఇందూరితో క‌లిసి బాల‌కృష్ణ ఎన్ బి కే బ్యాన‌ర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More Related Stories