English   

చిన్న సినిమాలకు పెద్ద సాయం..

ntr

పల్లెటూళ్లే దేశానికి పట్టుకొమ్మలు అన్నట్లు.. చిన్న సినిమాలే ఇండస్ట్రీకి ఊపిరి. వాటిని బతికేస్తే ఇండస్ట్రీ కూడా పది కాలాల పాటు ఉంటుంది. అందుకే ఇప్పుడు మన హీరోలు కూడా ఇదే చేస్తున్నారు. చిన్న సినిమాలకు తమ సపోర్ట్ ఇస్తున్నారు. ఎన్టీఆర్.. రామ్ చరణ్.. నాని ఇలా ఏ హీరోను తీసుకున్నా కూడా ఇప్పుడు తమ సాయాన్ని చిన్న సినిమాలకు ఇస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ నే తీసుకోండి.. ఈయన సాధారణంగా తన సినిమా వేడుకలు.. అన్నయ్య సినిమాల వేడుకలకు తప్ప బయటికి రావడం అరుదు. మహా అయితే అప్పుడప్పుడూ మహేశ్ లాంటి హీరోలతో కలుస్తుంటాడు. కానీ ఈ మధ్య జూనియర్ బాగా మారిపోయాడు. ఇప్పుడు స్టంట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ మాయ పేరేమిటో సినిమా ఆడియో వేడుకకు వచ్చాడు. 

ఫంక్షన్ అంతా ఉండటమే కాదు.. చివర్లో తన స్పీచ్ తో అలరించాడు కూడా. తాను ఈ వేడుకకు రావడానికి కారణం విజయ్ మాస్టర్ అంటూ చెప్పాడు. యంగ్ టైగర్ రావడం వల్లే ఈ మాయ పేరేమిటో అనే సినిమా గురించి ప్రేక్షకులకు కూడా తెలిసింది. ఇదే సినిమాకు తన వాయిస్ ఓవర్ ఇచ్చాడు నాని. ఈయన స్వరంతోనే ట్రైలర్ కూడా మొదలవుతుంది. ఈ మధ్యే గూఢాచారి ట్రైలర్ ను కూడా నానినే విడుదల చేసాడు. అడవిశేష్ నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 3న విడుదల కానుంది. దాంతో పాటు రామ్ చరణ్ కూడా తన చెల్లి సినిమాను సపోర్ట్ చేస్తూ ఆడియో వేడుకకు వచ్చాడు. మిగిలిన హీరోలు కూడా ఇప్పుడు చిన్నసినిమాలకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఇండస్ట్రీకి ఇంకాస్త మంచి రోజులు వచ్చినట్లే..

More Related Stories