English   

ఎన్టీఆర్ కు ల‌వ‌కుశ‌లు జ‌న్మించారు..?

ntr had a baby boy
2018-06-14 17:53:55

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ భార్య ప్ర‌ణ‌తి ప్ర‌స‌వించారు. మ‌ళ్లీ ఈ దంప‌తుల‌కు బాబు జ‌న్మించాడు. ఈ విష‌యాన్ని ఎన్టీఆరే స్వ‌యంగా ట్వీట్ చేయ‌డంతో ఇన్నాళ్లూ ఎన్టీఆర్ కు పాప అన్న వాళ్లంతా మూసుకున్నారు. నిజానికి పాప అనే రూమ‌ర్స్ వ‌చ్చిన టైమ్ కు అస‌లు ప్ర‌ణ‌తి ప్ర‌స‌వించ‌లేదు. అయినా రూమ‌ర్ రాయుళ్లు రెచ్చిపోయారు. బ‌ట్ ఫైన‌ల్ గా బాబు పుట్టాడ‌ని తెలిశాక‌.. ఒక్క‌సారిగా సోష‌ల్ మీడియా అంతా కంగ్రాట్యులేష‌న్స్ తో మార్మోగిపోతోంది. బ‌డా స్టార్స్ నుంచి స్మాల్ స్టార్స్ వ‌ర‌కూ ఎన్టీఆర్ కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. 

ఇక ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసిన ఎన్టీఆర్.. నా ఫ్యామిలీ విస్త‌రిస్తోంది.. మ‌ళ్లీ బాబు అంటూ సింపుల్ గా చెప్పేశాడు. ఇక విషెస్ అన్నీ ఒకెత్త‌యితే ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ చేసిన ట్వీట్ చాలామందిని ఆక‌ట్టుకుంటోంది. మ‌రో బండిల్ ఆఫ్ జాయ్ మీ ఇంటికొచ్చింది.. ఇప్పుడు తార‌క్ రామ్ కు నిజ‌మైన ల‌వ‌కుశ‌లు జ‌న్మించారు అన్నాడు. కాక‌పోతే ఆ ల‌వ‌కుశ‌లు క‌వ‌ల‌లు. వీళ్లు కాదు. అంతే తేడా. అయినా ఈ పోలిక అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. 

More Related Stories