English   

ఎన్టీఆర్ ప్రోమో భలే ఉందిగా

NTR-IPL-11
2018-04-03 18:46:42

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు స్టార్ మాకు మాంచి అండర్ స్టాండింగ్ కుదిరిందని అందరికీ తెలుసు. బిగ్ బాస్ సీజన్ ఒన్ నుంచే ఈ బాండ్ స్ట్రాంగ్ అయింది.  ప్రస్తుతం ఈ స్టార్ మా టివి ఐపియఎల్ సీజన్-11ను తెలుగులో ప్రసారం చేయబోతోంది. ఈ ప్రసారాలకు సంబంధించిన ప్రోమోస్ ను కూడా ఎన్టీఆర్ తో చేయించింది స్టార్ మా. ఇవాళ ఈ ప్రోమోస్ రిలీజ్ చేసింది స్టార్ మా. తెలుగులో నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఓ రూమ్ లో వంట ప్రిపేర్ చేస్తుంటారు. అందరూ ఐపియల్ గురించి మాట్లాడుతూ మధ్యలో తెలుగులో కామెంట్రీ గురించి కామెంట్ చేస్తారు. 

అప్పుడు ఎన్టీఆర్ ఓ లాంగ్ డైలాగ్ చెబుతాడు. తెలుగులో అయితే ఏంటా?  కారం లేని కోడి... ఉల్లిపాయ లేని పకోడి... పెట్రోల్ లేని గాఢీ... పరుగెత్తడం రాని కేడీ.. అవకాయ లేని జాఢీ.. ఆటల్లేని బడి..  అమ్మప్రేమ లేని ఒడి.. అంటూ గుక్కతిప్పుకోకుండా డైలాగులు చెప్పేశాడు తారక్. వెంటనే ఒప్పుకున్నామంటూ నమస్కరిస్తాడు అతను. అసలు మజా... తెలుగులోనే అంటూ అదిరిపోయే డైలాగ్ తో ఉన్న ఈ ప్రోమోకు దర్శకుడు త్రివిక్రమ్ కావడం విశేషం. ఆ క్లాస్ నెస్ కనిపిస్తోంది కూడా. అయితే ఈ ప్రోమోతో ఎన్టీఆర్ లుక్ తెలుస్తుంది అనుకున్నారు. కానీ పెద్దగా తేడా ఏం లేదు. సడెన్ గా వచ్చిన మార్పు కూడా లేదు. మొత్తంగా ఎన్టీఆర్ మళ్లీ బుల్లితెరపై పదేపదే సందడి చేయబోతున్నాడు. ఇక ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. ఓ రకంగా ఇద్దరి మధ్య కరెక్ట్ రాపో ఏర్పడటానికి కూడా ఈ ప్రోమో షూట్ పనికొస్తుందనుకోవచ్చు.

More Related Stories