English   

మహేష్ బాబు, ఎన్టీఆర్ ఓ బిగ్గెస్ట్ మల్టీస్టారర్

NTR_Mahesh
2018-03-19 17:59:28

ఊపిరి పీల్చుకో టాలీవుడ్.. ఈ వార్త విన్న తర్వాత నీ రేంజ్ ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే నీకు. ఆ రేంజ్ మల్టీస్టారర్ కు రంగం సిద్ధమైపోయింది. ఇద్దరు మోస్ట్ టాలెంటెడ్ హీరోలు.. కలిసి మరో మోస్ట్ టాలెంటెడ్ డైరక్టర్ ఒకే ఫ్రేమ్ లోకి తీసుకురాబోతున్నాడు. ఆ హీరోలు మహేష్ బాబు, ఎన్టీఆర్ అయితే.. ఆ దర్శకుడు కొరటాల శివ.ఊహించడానికి కూడా ఏదోలా ఉంది కదూ. యస్.. బట్ ఈ గ్రేట్ కాంబినేషన్ అతి త్వరలోనే అనౌన్స్ కాబోతోంది. ఇది రూమరో, గాసిప్పో అస్సలు కాదు. ఇంకా చెప్పాలంటే ఈ గ్రేట్ మల్టీస్టారర్ కు సంబంధించిన అఫీషియల్ న్యూస్ మరో వారంలోనే అందరికీ తెలియబోతోంది. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ పై భారీ అంచనాలున్నాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్, మహేష్ బాబు ల మల్టీస్టారర్ అంటే అది అంచనాలు అందేది కాదు. మరి ఈ వార్త ఎప్పుడు ఎవరు ఎలా చెప్పబోతున్నారు..?

ఏప్రిల్ 7న సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా వైజాగ్ లోనే నిర్వహించబోతున్నారు. ఆ రోజు అక్కడే ఈ మల్టీస్టారర్ కు సంబంధించిన అఫీషియల్ న్యూస్ బయటకు వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ మల్టీస్టారర్ కు దర్శకుడే కాదు.. నిర్మాత కూడా భరత్ అనే నేను వాళ్లే కావొచ్చని తెలుస్తోంది. ఏదేమైనా ఇలాంటి మల్టీస్టారర్ ను టాలీవుడ్ ఇప్పట్లో ఎక్స్ పెక్ట్ చేయలేదు. కానీ ఊహించని రీతిలో అనౌన్స్ కాబోతోన్న ఈ ప్రాజెక్ట్ నిజంగా ఆడియన్స్ కే కాదు టాలీవుడ్ కూ బిగ్గెస్ట్ సర్ ప్రైజ్. 

ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడు. తర్వాత రామ్ చరణ్ తో రాజమౌళి డైరెక్షన్ లో మల్టీస్టారర్ చేస్తాడు. ఆ తర్వాతే మహేష్ బాబు, కొరటాలతో ఈ భారీ మల్టీస్టారర్ ఉండబోతోంది. అటు మహేష్ బాబు భరత్ అనే నేను తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేస్తాడు. ఇది ఆయనకు 25వ సినిమా. అది పూర్తైన తర్వాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డితో సినిమా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ భారీ మల్టీస్టారర్ కు సిద్ధమవుతాడు. ఇప్పటికి వినిపిస్తోన్న దాన్ని బట్టి ఈ భారీ మల్టీస్టారర్ 2020 వేసవిలో విడుదల కావొచ్చు. 

More Related Stories