English   

మ‌హేష్‌, ఎన్టీఆర్ - ప‌వన్ క‌ళ్యాణ్‌, బ‌న్నీ.. కొత్త ఎత్తుగ‌డ‌

ntr-mahesh
2018-04-24 07:16:03

ప‌రిశ్ర‌మ‌లో రాజ‌కీయాలు మొద‌ల‌య్యాయి. ఎవ‌రికి వారు కొత్త ప‌ర్ఫార్మెన్స్ తో ఆడియ‌న్స్ మాయ చేస్తున్నారు. ఈ మాయ‌లో ప‌డ్డ ఆడియ‌న్స్ వారికి కొత్త రికార్డులు కట్ట‌బెడుతున్నారు. అభిమానులే మారాల్సింది అన్న మ‌హేష్ మాట నిజం. నిజంగా ఇప్పుడు మారాల్సింది అభిమానులేజ‌. కాదంటే క‌నీసం ప్రేక్ష‌కులు. ఇప్పుడు చెప్పుకున్న హీరోల్లో ఒక్క ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ప్ప మిగ‌తా అంద‌రూకొత్త ఎత్తుగ‌డ‌ల‌తో కొత్త రికార్డుల‌కు దారులు వేసుకుంటున్న వారే. మ‌రి ఇది ఎలా జ‌రుగుతోంది. దీని వెన‌క ఉన్న అస‌లు క‌థేంటీ..?

మ‌హేష్ బాబు గ‌త రెండు సినిమాలు ఫ్లాప్స్. ఇంకా చెబితే డిజాస్ట‌ర్స్. ఇప్పుడు భ‌ర‌త్ అనేనేనుతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాము అని చెప్పుకుంటోన్నా భ‌ర‌త్ లో అంత ప‌స లేద‌నేది అంద‌రికీ తెలుసు. అయినా మూడు రోజుల్లో వంద కోట్ల గ్రాస్ అంటూ గ్రాండ్ గా పోస్ట‌ర్స్ వేసుకుంటున్నారు. నిజానికి అంత వ‌చ్చాయా లేదా అనేది ప‌క్క‌న బెడితే వ‌చ్చాయి అని న‌మ్మిస్తూ తాము ఫ్లాప్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డాం అనిపించుకున్నాడు మ‌హేష్‌. దీనికి కొర‌టాల మార్క్ క‌థ‌నం కాస్త తోడై.. భ‌ర‌త్ హిట్ అనిపించారు. మ‌రి దీనికీ ఎన్టీఆర్ కు ఏ సంబంధం లేదా.. అంటే ఉంది. దాన్నే రాజ‌కీయం అంటాం. 

సింపుల్ గా చెబితే.. గ‌తంలో మ‌హేష్ బాబు సినిమాల‌కు ఫ్లాప్ టాక్ వస్తే ఇత‌ర హీరోల అభిమానులు విప‌రీతంగా ట్రోల్ చేసేవారు. వారిలో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఉన్నారు. ఆడియో ఫంక్ష‌న్ కు ఎన్టీఆర్ ను చీఫ్ గెస్ట్ గా పిలిచి అత‌ని అభిమానుల‌ను కాస్తా బుట్ట‌లో వేసుకున్నారు అని అప్ప‌ట్లోనే వినిపించింది. దీనికి కొర‌టాల మీడియేటింగ్ బాగా ప‌నిచేసింది. దీంతో ఇప్పుడు భ‌ర‌త్ యావ‌రేజ్ సినిమా అయినా ఇత‌ర హీరోల అభిమానులు పెద్ద‌గా ట్రోల్ చేయ‌డం లేదు. ఇందుకు ప్ర‌తిఫ‌లంగా రేపు ఎన్టీఆర్ సినిమా ఫంక్ష‌న్ కు మ‌హేష్ వెళ‌తాడు. బ‌దులుగా అత‌ని అభిమానులు ఎన్టీఆర్ సినిమా సూప‌ర్ అంటారు. ఇది ఒక‌ర‌కంగా క్విడ్ ప్రో కో లాంటిదే. 

ఇక చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అంటూ కొన్నాళ్ల క్రితం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులతో పాటు ఆయ‌న ఆగ్ర‌హానికీ గుర‌య్యాడు అల్లు అర్జున్. దాని ఫ‌లితం త‌ర్వాత అనుభ‌వించాడు. అత‌ని ప్ర‌తి సినిమా ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ నుంచి మొద‌లై ట్రైల‌ర్, సినిమా వ‌ర‌కూ ప‌వ‌న్ ఫ్యాన్స్ విప‌రీతంగా ట్రాల్ చేశారు. బ‌న్నీ లాస్ట్ మూవీ దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ ఈ ట్రోలింగ్ వ‌ల్ల చాలా న‌ష్ట‌పోయింది కూడా. అంత‌కు ముందే మొద‌లైన ఈవ్య‌వ‌హారం తీవ్ర‌త మ‌నోడికి  డిజే వ‌ర‌కూ తెలిసొచ్చింది. దీంతో ఎలా హ్యాండిల్ చేయాలా అని ఆలోచిస్తోన్న టైమ్ లో శ్రీ రెడ్డి అబ్యూజింగ్ క‌లిసొచ్చింది. ప‌వ‌న్ పిలుపును అందుకున్న వెంట‌నే బ‌న్నీ ప‌రుగెత్తుకెళ్లాడు. అంత‌కు ముందే అత‌ని తండ్రి అల్లు అర‌వింద్ ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ ఏకేశాడు. అదే ప‌న్లో ప‌వ‌న్ అంటే త‌మ‌కు చాలా ఇస్టం అన్న క‌ల‌రింగ్ కూడా ఇచ్చాడు. దీన్ని క‌రెక్ట్ గా అర్థం చేసుకున్న బ‌న్నీ వెంట‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం ఫిల్మ్ ఛాంబ‌ర్ కు వెళ్లాడు. త‌ర్వాత అత‌ని నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఆడియో ఫంక్ష‌న్లో ప‌వ‌న్ కోసం ఏమైనా చేస్తాం అన్న రేంజ్ లో మాట్లాడాడు. సినిమా గురించి నాలుగు నిమిషాలు.. ప‌వ‌న్ గురించి ఆరు నిమిషాలు మాట్లాడి ప‌వ‌న్ అభిమానుల‌ను కూల్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు. ఇది ఫ‌లించిన‌ట్టే క‌నిపిస్తోంది. సో త్వ‌ర‌లో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా విడుద‌ల‌ ఉంది కాబ‌ట్టి దానికేం న‌ష్టం క‌ల‌గ‌కుండా(అదీ ప‌వ‌న్ ఫ్యాన్స్ నుంచి) భ‌లే క‌వ‌ర్ చేశాడు అనుకున్నారు చాలామంది. అనుకోవ‌డం త‌ప్పు కూడా లేదు. ఇన్నాళ్లూ ప‌వ‌న్ విజన్ గురించి మాట్లాడ‌ని అత‌ను స‌డెన్ గా ఇంత స్పెష‌ల్ స్పీచ్ ఇస్తే ఎవ‌రికైనా అర్థ‌మౌతుంది. 

నిజానికి బ‌న్నీ ఇలా చేయ‌డంలోనూ మ‌రో కోణం ఉంది. రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం నాన్ బాహుబ‌లి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు భ‌ర‌త్ అనేనేను ఆ రికార్డ్ కు చేరువ‌గా వెళ్లేలా ఉంది. మ‌రి దాన్ని అందుకున్నా అందుకోక‌పోయినా.. క‌నీసం ద‌గ్గ‌ర‌గా వెళ్లాలి అంటే ఇలాంటి ప్రాబ్ల‌మ్స్ అన్నీ ముందే క్లియ‌ర్ చేసుకోవాలి. అందుకు శ్రీరెడ్డి ఇష్యూ అనుకోకుండా క‌లిసొచ్చంది. దాన్ని అర‌వింద్ అండ్ బ‌న్నీ క‌రెక్ట్ గా ప‌ట్టేసుకున్నారు. ఒక‌వేళ ఇవ‌న్నీ అబద్దాలే అనుకున్నా.. భ‌విష్య‌త్ లో బ‌న్నీ ప‌వ‌న్ కోసం ఎలాంటిస్టెప్పులు వేస్తాడు అనేది కూడా ఈజీగా ఊహించొచ్చు. ఏదేమైనా ఇప్పుడు ఇండ‌స్ట్రీలో క్విడ్ ప్రో కో అనే ప్రోగ్రామ్ న‌డుస్తోంది. ఇది అర్థం కాని అభిమానులు(అయినా చేసేదేం లేదు కాబ‌ట్టి).. త‌మ హీరోలు జెన్యూన్ గానే రికార్డులు కొట్టార‌నుకుంటున్నారు. 

More Related Stories