English   

ఆర్ఆర్ఆర్ తరవాత ఎన్టీఆర్ సినిమాల లిస్ట్ ఇదే

 NTR
2021-04-12 16:53:52

ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. దాంతో ఎన్టీఆర్ ఏ ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తాడ‌న్న‌ది ప్ర‌శ్నగా మారింది. 

అయితే ఇప్ప‌టికే ఎన్టీఆర్ ప‌లు క్రేజీ ప్రాజ‌క్టుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర‌వాత ఎన్టీఆర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్ప‌టికే ఎన్టీఆర్ కొర‌టాల కాంబినేష‌న్ లో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఈ కాంబినేష‌న్ పై ఎన్నో అంచ‌నాలున్నాయి. అంతే కాకుండా మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్ లో ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ సినిమా ఒక‌టి ఇప్ప‌టికే క‌న్ఫామ్ అయింది. 

మ‌రోవైపు ఎన్టీఆర్ ...అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలోనూ ఒక సినిమా చేయ‌బోతున్న‌ట్టు గుసగుస‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ మ‌రియు దిల్ రాజు సంయుక్తంగా నిర్మించ‌బోతున్నాయి. 

More Related Stories