English   

 ఎన్టీఆర్ ను వాళ్లే వద్దన్నారట

kalyan-ram
2018-05-08 07:21:00

ఇండస్ట్రీలో కొన్ని విషయాలు చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా ఫాల్స్ న్యూసే ఉంటాయి. కానీ కొందరు వీటిన నిజమని నమ్ముతారు. లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ విషయంలోనూ ఇదే కనిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం ఎన్టీఆర్ ఎమ్మెల్యే ఫంక్షన్ కు రాలేదని ఈ ఇద్దరూ విడిపోయారా అంటూ రకరకాల వార్తలు షికారు చేశాయి. ఇప్పుడు నా నువ్వే ఆడియో ఫంక్షన్ కు రాలేదు కాబట్టి.. ఇద్దరి మధ్య నిజంగానే తేడాలున్నాయి. కావాలంటే ఇప్పుడు కూడా రాలేదు చూడండి అంటూ ఏవేవో రాసేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ రీసెంట్ గా కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఓపెనింగ్ కు  కూడా వచ్చిన సంగతి మర్చిపోతున్నారు. అయితే అసలు ఎన్టీఆర్ నా నువ్వే ఆడియోకు ఎందుకు రాలేదు.. అంటే కళ్యాణ్ రామ్ అండ్ టీమే రావొద్దు అని చెప్పారని ఎంతమందికి తెలుసు.. యస్.. ఎన్టీఆర్ ను కళ్యాణ్ రామే రావొద్దన్నాడట.

యంగ్ టైగర్ ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాడు. అయినా నా నువ్వే ఆడియో కు రాలేదు. కారణం ఏంటంటే.. వీరి సన్నిహితులకు సంబంధించిన ఓ పెళ్లికి అతను ఖచ్చితంగా అటెండ్ కావాల్సి వచ్చింది. దీంతో కళ్యాణ్ రామే నువ్వు పెళ్లికి వెళ్లు.. తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రావొచ్చులే అని చప్పాడట. దీంతో యంగ్ టైగర్ పెళ్లికి వెళ్లాడు. కానీ అయితే ఆడియో ఫంక్షన్ కు కూడా మరీ గ్రాండ్ గా కాకుండా సింపుల్ గా కానిచ్చారు. అది కూడా ఎన్టీఆర్ ను ఇప్పుడు వద్దు అని చెప్పడానికి ఓ రీజన్ అంటున్నారు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా ఇద్దరూ విడిపోయారా అంటూ కొందరు రాసుకుంటున్నారు. ఏదేమైనా వాళ్లు ఇవన్నీ పట్టించుకుంటారా అనేది వేరే మేటర్. బట్.. యంగ్ టైగర్ మాత్రం నా నువ్వే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వస్తున్నాడు. ఇది కన్ఫార్మ్ అంటోంది ఎంటైర్ యూనిట్. 

More Related Stories