English   

తారక్ రామ్ తనయుడు భార్గవ్ రామ్

NTR-son
2018-07-04 13:42:41

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు రెండోసారి కూడా కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. మొదటి బాబుకు అభయ్ రామ్ అనే పేరు పెట్టిన ఎన్టీఆర్.. రెండో తనయుడికి భార్గవ్ రామ్ అనే పేరు పెట్టాడు. మొత్తంగా ఎన్టీఆర్ ఫ్యామిలీలో తండ్రి తనయుల పేర్లు భలే ఉన్నాయి. తండ్రి తారక్ రామ్.. తనయులు అభయ్ రామ్, భార్గవ్ రామ్. ఇక తనయుడికి పేరు పెట్టిన సందర్భంగా చిన్నబాబును ఒళ్లోపెట్టుకుని పక్కనే సతీమణి ఉండగా వెనక ఎన్టీఆర్ వీపుపై వాలి తమ్ముణ్ని తదేకంగా చూస్తోన్న అభయ్ రామ్ తో లిసి ఉన్న ఫోటో ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

తన పేరులాగానే తనయుల పేర్లలోనూ తాతగారి పేరు వినిపించేలా పెట్టుకున్నాడు. దీంతో తాతగారిపై తనకు ఎంత అభిమానం ఉందో మరోసారి చాటుకున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అరవింద సమేతవీరరాఘవ అనే సినిమా చేస్తున్నాడు. రాయాలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ ఇది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న అరవిందుడు దసరాకు విడుదల కాబోతున్నాడు. దీని తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కలిసి సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా 2019సమ్మర్ లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. 

More Related Stories