English   

ఎన్టీఆర్ నెంబ‌ర్ వ‌న్.. ఎనీ డౌట్స్..?

jr.ntr
2018-07-27 10:12:00

ఇన్నాళ్లూ చిన్న అనుమానం ఉండేది.. అప్పట్లో ఎన్టీఆర్ చేసిన బిగ్ బాస్ షో అనుకోకుండా అంత పెద్ద హిట్ అయిందా లేదంటే ఎన్టీఆర్ ఉన్నందుకే అంత‌గా చూసారా అని..? అంద‌రికీ ఓ క్లారిటీ ఉంది.. ఎన్టీఆర్ ఉన్నాడు కాబ‌ట్టే అంత పెద్ద హిట్టైంద‌ని.. కాక‌పోతే ఎక్క‌డో చిన్న అనుమానం కూడా ఉండేది. బిగ్ బాస్ తెలుగుకు ఫ‌స్ట్ సీజ‌న్ క‌దా.. అందుకే ఆస‌క్తితో చూసారు దానికి తోడు ఎన్టీఆర్ కూడా ఉన్నాడు కాబ‌ట్టి అంత‌గా హిట్టైంద‌ని. కానీ నాగార్జున‌.. చిరంజీవి.. ఇప్పుడు నాని కంటే ఎన్టీఆర్ టీవీల్లో పెద్ద తోపు అని మ‌రోసారి రుజువైంది. 

ఈయ‌న క‌నిపిస్తే రేటింగ్స్ వ‌స్తాయ‌ని ఇప్పుడు ఢీ 10 ఫైన‌ల్ తో మ‌రోసారి ప్రూవ్ అయింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఢీ చ‌రిత్ర‌లోనే ఎన్న‌డూ రాని విధంగా క‌ల‌లో కూడా చూడ‌ని విధంగా ఏకంగా 12 రేటింగ్ వ‌చ్చింది. ఇది చూసి ఈటీవీ కూడా షాక్ అయ్యుంటుంది. ఎందుకంటే ఈ రేటింగ్ చూసి వాళ్లు కూడా చాలా కాల‌మైంది. ఎన్టీఆర్ ఫైన‌ల్ కు వ‌చ్చాడు కాబ‌ట్టే ఇంత‌గా రేటింగ్ వ‌చ్చింది.. ఒక‌వేళ ఈయ‌న గానీ బిగ్ బాస్ 2 చేసుంటేనే రికార్డుల‌న్నీ బ‌ద్ధ‌లైపోయేవేమో..? అంటే దీన్ని బ‌ట్టి టీవీ స్క్రీన్ పై ఎన్టీఆర్ ను కొట్టడం అంత వీజీ కాదన్న‌మాట‌.. నాని అయినా చిరంజీవి అయినా నాగార్జున అయినా అంతా ఎన్టీఆర్ త‌ర్వాతే..!

More Related Stories