English   

అన్నగా యమదొంగ

NTR-Ram-Charan
2018-03-10 18:10:43

రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అన్నదమ్ములుగా నటిస్తున్నారని కన్ఫార్మ్ చేశారు. యస్.. ఈ మూవీలో ఇద్దరూ అన్నదమ్ములుగా నటించబోతున్నారు. అయితే వీరిలో అన్నగా యంగ్ టైగర్ నటిస్తోంటే, తమ్ముడిగా చరణ్ యాక్ట్ చేస్తున్నాడు. ఏజ్ తో పాటు ఇండస్ట్రీలో నిజగానే చరణ్ కంటే ఎన్టీఆర్ సీనియర్. అందుకే యమదొంగను అన్నను చేసి మగధీరుడ్ని తమ్ముడిగా మార్చాడు జక్కన్న. సింపుల్ గా చెబితే పెద్దోడు, చిన్నోడుగా చెప్పొచ్చు. పెద్దోడైనా చిన్నోడైనా పాత్రల్లోనే.. కానీ నిడివిలో తేడా ఉండదనేది టాక్. మరోవైపు ఈ సినిమా కోసం రీసెంట్ గా యూఎస్ వెళ్లారు  ఈ ఇద్దరూ. అఫ్ కోర్స్ రాజమౌళి కూడా వెళ్లాడనుకోండి. అక్కడ వారం పాటు కథపై వర్క్ షాప్ ఉంటుందనే రూమర్స్ వినిపించాయి. కానీ కేవలం ఒక్కరోజు కోసం మాత్రమే వీళ్లు అక్కడికి వెళ్లారట. అది కూడా ఫోటోషూట్ కోసం. ఈ ఫోటోస్ ను ఓపెనింగ్ రోజునో లేక అఫీషియల్ అనౌన్స్ మెంట్ రోజునో విడుదల చేసే అవకాశం ఉంది. 

ఇక సినిమా కథపైనా చాలా కథలు వినిపిస్తున్నాయి. ఈ కథ ఇలా ఉంటుంది.. అలా ఉంటుంది అనీ. అయితే విశ్వసనీయంగా తెలుస్తోన్న దాన్ని బట్టి ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనరట. కాకపోతే రాజమౌళి మార్క్ యాక్షన్ అండ్ ఎమోషన్ కూడా పీక్స్ లో ఉంటుందని వినిపిస్తోంది. బాహుబలి తర్వాత చేస్తోన్న సినిమా కాబట్టి ఎంటర్టైన్మెంట్ పరంగా దానికి ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నాడు జక్కన్న. అందుకే ప్రీ ప్రొడక్షన్ కే చాలా టైమ్ తీసుకుంటున్నాడు. ఆల్రెడీ లొకేషన్ ఫైండింగ్ అయిపోయింది. క్యారెక్టర్స్ డిసైడ్ అయిపోయాయి. ఎవరి పాత్ర ఎలా ఉంటుందనే విషయంలో హీరోలిద్దరికీ బ్రీఫింగ్ అయిపోయింది. ఇక హీరోయిన్లు మాత్రం ఫైనల్  కావాల్సి ఉంది. మొత్తంగా ఎవ్వరూ ఊహించని విధంగా మల్టీస్టారర్ సెట్ చేసిన రాజమౌళి అలాగే ఊహలకు అందని కథాంశంతోనే మెస్మరైజ్ చేయబోతున్నాడనేది కన్ఫార్మ్ అంటున్నారు. 
 

More Related Stories