English   

రాజమౌళీ.. ఇది టూమచ్ గురూ..

NTR-Charan
2018-03-21 18:23:13

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల భారీ మల్టీస్టారర్ కు ఏమైంది..? ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ గా వినిపిస్తోన్న టాపిక్ ఇదే. రాజమౌళి వంటి బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్ తెరకెక్కించబోయే ఈ సినిమా ఎందుకు లేట్ అవుతోంది.. అసలు ఎప్పుడు వస్తుంది.. అనే ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇన్ని ప్రశ్నలకు కారణాలేంటో తెలుసా.. ఈ సినిమా ఇప్పుడప్పుడే రావడం లేదు. ఏకంగా రెండేళ్లకు పైగా టైమ్ తీసుకోబోతోంది. యస్.. ఈ వేసవిలోనే ప్రారంభోత్సవం జరుపుకోబోతోన్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ 2019లో వస్తుందనుకున్నారు చాలామంది. కానీ 2020 సమ్మర్ లో వస్తుందట ఈ సినిమా. అంటే రెండేళ్ల తర్వాత అన్నమాట. మరి అంత టైమ్ ఎందుకు తీసుకుంటున్నారు. పైగా ఇప్పుడు ఎన్టీఆర్, చరణ్ చేతిలో కూడా ఒక్కో సినిమా మాత్రమే ఉంది కదా.. అంటే సమాధానం వెరైటీగా వస్తోంది. 

ఈ మల్టీస్టారర్ కు సంబంధించి ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ చాలా వరకూ పూర్తైంది. లొకేషన్స్ కూడా ఫైండ్ అవుట్ చేశారు. ఇద్దరు హీరోలకూ ఫోటో షూట్ కూడా పూర్తైంది. అయినా ఎందుకంత లేట్.. అంటే రాజమౌళి వళ్లే అంటున్నారు. అవును.. ఈ సినిమా కోసం జక్కన్న ఏడాది టైమ్ తీసుకుంటాడట. ఆ తర్వాత ఆరు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది. అంటే యేడాదిన్నర. మరి మిగతా ఆరు నెలలు అంటే.. ఇదుగో ఇప్పుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో, చరణ్ బోయపాటితో చేస్తోన్న సినిమాలకు తీసుకుంటారు. సో అఫీషియల్ గా ఈ మూవీ ఈ సమ్మర్ లోనే ప్రారంభమైనా.. ప్రొడక్షన్ మొదలయ్యేదే 2019ఆరంభంలో. ఆ యేడాదంతా షూటింగ్. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్. అన్నీ పూర్తి చేసుకుని 2020 సమ్మర్ లో విడుదల.  పైగా ఈ సినిమాకు గ్రాఫిక్, విజువల్ ఎఫెక్ట్స్ కు సంబంధించిన వర్క్ కూడా లేదని చెబుతున్నారు. అయినా అంత టైమ్ తీసుకోవడం అంటే  ఇది టూ మచ్ గురూ అనిపించకమానదు. 

More Related Stories