English   

త్రివిక్ర‌మ్ ఆ సెంటిమెంట్ ప‌ని చేస్తుందా..?

 Trivikram-NTR
2018-05-21 17:22:20

త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌ను సిద్ధం చేస్తున్నాడు. అయితే ఇక్క‌డే ఓ సెంటిమెంట్ ఈ ద‌ర్శ‌కుడికి బాగా క‌లిసొస్తుంది. అదే ప‌వ‌న్ ద‌ర్శ‌కులు ఎన్టీఆర్ కు హిట్ ఇచ్చే సెంటిమెంట్. అవును.. అది కూడా ఫ్లాపుల త‌ర్వాత..! త్రివిక్ర‌మ్ ఇప్పుడు అజ్ఞాత‌వాసితో భారీ డిజాస్ట‌ర్ ఇచ్చాడు. ఆయ‌న కెరీర్ లోనే కాదు.. ప‌వ‌న్ కెరీర్ లో కూడా ఇదే పెద్ద డిజాస్ట‌ర్. న‌ష్టాల ప‌రంగా తెలుగులో స్పైడ‌ర్ త‌ర్వాత అంత‌టి డిజాస్ట‌ర్ ఇది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాతో తానేంటో నిరూపించుకునే ప‌నిలో ఉన్నాడు మాట‌ల మాంత్రికుడు. ఇక్క‌డే ఓ సెంటిమెంట్ ఉంది. ప‌వ‌న్ తో ఫ్లాప్ ఇచ్చిన ద‌ర్శ‌కులు ఎన్టీఆర్ తో సినిమా చేస్తే హిట్లు వ‌స్తున్నాయి. పూరీ జ‌గ‌న్నాథ్ కెమెరామెన్ గంగ‌తో రాంబాబు త‌ర్వాత ఎన్టీఆర్ తో టెంప‌ర్ చేసాడు. అది మంచి విజ‌యం సాధించింది. పైగా అందులో ఎన్టీఆర్ ను చాలా కొత్త‌గా చూపించాడు పూరీ. ఇక స‌ర్దార్ తో ఫ్లాప్ ఇచ్చిన బాబీ కూడా వెంట‌నే ఎన్టీఆర్ తో జై ల‌వ‌కుశ చేసి ప‌ర్లేద‌నిపించాడు. ఈ చిత్రంలోనూ ఎన్టీఆర్ ను కొత్త‌గా చూపించాడు బాబీ. ఇక ఇప్పుడు త్రివిక్ర‌మ్ వంతు. అయితే బాబీ, పూరీ మాదిరి ఎన్టీఆర్ ను కొత్త‌గా చూపించే ప్ర‌య‌త్న‌మైతే త్రివిక్ర‌మ్ చేస్తున్న‌ట్లు లేదు. అదే రొటీన్ క‌థ‌తోనే వ‌స్తున్న‌ట్లు ఫ‌స్ట్ లుక్ తోనే అర్థ‌మైపోతుంది. మ‌రి సెంటిమెంట్ ఏం చేస్తుందో చూడాలిక‌..! అది వ‌ర్క‌వుట్ అయితే త్రివిక్ర‌మ్ పంట పండిన‌ట్లే..!

More Related Stories