English   

‘ఎన్టీఆర్’పై ఎన్టీఆర్ సీరియస్

jr.ntr
2018-07-13 19:32:04

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. లేటెస్ట్ గా ఓ మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. ‘సెలెక్ట్’ పేరుతో ప్రారంభమయ్యే ఈ  మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్..కు ఎన్టీఆర్ ప్రచారం చేస్తాడన్నమాట. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ హైదరాబాద్ లోని హైటెక్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే అనౌన్స్ మెంట్ తర్వాత మాట్లాడుతూ మీడియా ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు ఎన్టీఆర్. ఇదే టైమ్ కొందరు నందమూరి తారకరామారావు బయోపిక్ గురించి అడిగారు. దీంతో ఎన్టీఆర్ కాస్త సీరియస్ అయ్యినట్టు కనిపించాడు. 

ఎన్టీఆర్ బయోపిక్ లో మీరు నటిస్తారా..? నటించమని ఇప్పటి వరకూ ఎవరైనా అడిగారా వంటి ప్రశ్నలకు ఆయన కాస్త సీరియస్ అయ్యాడు. ఈ విషయంలో నేరుగా సమాధానం ఇవ్వలేదు. అలా అడిగిన రిపోర్టన్ నే నా పాత ఇంటర్వ్యూస్ చూడమని చెప్పాడు. అంటే దానర్థం.. ఈ విషయంలో తననెవరూ సంప్రదించలేదనీ.. అయినా అంత పెద్ద పాత్రలు చేసే స్థాయి నాకింకా రాలేదని.. ఇలా ఆ మధ్య కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు ఎన్టీఆర్.. మరోసారి వాటిని చూసుకుంటే బెటర్ అన్నట్టుగా ఆ రిపోర్టర్ కు కౌంటర్ వేశాడు. ఒకరకంగా ఈ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు కూడా ఎన్టీఆర్ ఎక్స్ ప్రెషన్ లో చాలా మార్పులు కనిపించడం విశేషం. ఏదేమైనా ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ లేకపోవడం వింతేమీ కాదు కానీ.. మళ్లీమళ్లీ అదే ప్రశ్నలు వీళ్లు మాత్రం ఎందుకడుగుతున్నారో..

More Related Stories