English   

కొత్త ముఖ్యమంత్రి కోసం కొత్తగా ఎన్టీఆర్ ..?

NTR-Bharat-Ane-Nenu
2018-04-04 08:36:46

ఏవిటో.. టాలీవుడ్ కు చాలామంచి రోజులు వచ్చాయనే అనిపిస్తోంది. వరుసగా స్టార్ హీరోలంతా రూట్ మార్చి మంచి కథలతో సూపర్ హిట్స్ కొడుతున్నారు. మరోవైపు ఒకరి సినిమాలను ఒకరు పొగుడుతున్నారు. ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్ చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు ఎవరికి వారేగా ఉన్న మన స్టార్ హీరోలు మెల్లగా ఒకరికోసం ఒకరుగా కదులుతున్నారు. లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కొత్తగా వస్తోన్న ముఖ్యమంత్రి కోసం ఓ బహిరంగ సభకు హాజరు కాబోతున్నాడు. బట్ ఇది ఒరిజినల్ పొలిటికల్ మీటింగ్ కాదు. భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్. అవడానికి ప్రీ రిలీజ్ ఫంక్షనే అయినా.. ఓ పార్టీ బహిరంగ సభకు ఏ మాత్రం తీసిపోకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 7న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగబోయే ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్ హాజరు కాబోతున్నాడు. ఇది అఫీషియల్ గానూ కన్ఫార్మ్ అయింది. 

ఎన్టీఆర్ మొదటి సారిగా ఓ మహేష్ బాబుకు సంబంధించిన సినిమా ఫంక్షన్ కు అఫీషియల్ గా అటెండ్ అవుతున్నాడు. అయితే ఎన్టీఆర్ ను పిలవాలన్న ఆలోచన దర్శకుడు కొరటాల శివదేనట. అతను ఎన్టీఆర్ ను మాత్రమే కాదు.. రామ్ చరణ్ ను కూడా ఇన్వైట్ చేశాడు. కాకపోతే అతను వస్తాడా లేదా అనేది ఇంకా కన్ఫార్మ్ కాలేదు. నిజానికి ఒక్క స్టార్ హీరో ఫంక్షన్ ను హ్యాండిల్ చేయడమే నిర్వాహకులైనా, పోలీస్ లకైనా పెద్ద సవాల్. అలాంటి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫంక్షన్ కు ఎన్టీఆర్ కూడా వస్తే ఇంకేమైనా ఉందా..? కానీ అలాంటి ఇబ్బందులు ఉంటాయనే ఇంత పెద్ద వేదిక ఏర్పాటు చేసుకున్నారు. అన్నట్టు ఇది రొటీన్ సినిమా ఫంక్షన్స్ లా కాకుండా ఏకంగా ఎల్బీ స్టేడియంలో మినీ అసెంబ్లీ సెట్ నే వేస్తున్నారనే టాక్ కూడా ఉంది. ఇప్పటికే సినిమా కోసం భారీ అసెంబ్లీ సెట్ వేసింది టీమ్. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా అంటే ఖర్చు భారీగానే ఉంటుందనుకోవచ్చు. మొత్తంగా డివివి దానయ్య నిర్మిస్తోన్న భరత్ అనేనేనులో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెల 20న విడుదల కాబోతోన్న భరత్ అనేనేనుపై భారీ అంచనాలే ఉన్నాయి.  

More Related Stories