English   

బిగ్ బాస్ నుంచి ఎన్టీఆర్ అవుట్..

ntr-bigg-boss

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మల్టీటాలెంటెడ్ గా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. జై లవకుశతో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన యంగ్ టైగర్ బుల్లితెరపైనా హోస్ట్ గా ఇరగదీశాడు. బిగ్ బాస్ షో ఫస్ట్ సీజన్ కు హోస్ట్ గా యంగ్ టైగర్ యాంకరింగ్ ఎవరూ మర్చిపోలేరు. ఆ స్థాయిలో మెప్పించాడు. నిజానికి ఆ టైమ్ లో జై లవకుశ షూటింగ్ లో కూడా ఉన్నాడు. ఈ రెండూ మ్యానేజ్ చేసుకుంటూ ఒన్ మేన్ షోతో రెండిటినీ సూపర్ సక్సెస్ చేశాడు. అయితే బిగ్ బాస్ షోకు ఎన్టీఆర్ ఉన్న రెండు రోజులప్పుడు వచ్చినంత రేటింగ్ ఆ తర్వాత రాలేదు. అలాగే సేమ్ టైమ్ లో సౌత్ మొత్తం వచ్చిన అన్ని బిగ్ బాస్ షోస్ కంటే తెలుగులోనే పెద్ద సక్సెస్ అయిందీ షో. దీంతో  సెకండ్ సీజన్ కూ యంగ్ టైగర్ నే కంటిన్యూ చేయాలనుకుంది టీమ్. ఆ మేరకు వార్తలు కూడా వచ్చాయి. పైగా ఈ సారి కంటెస్టెంట్స్ విషయంలోనూ కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకోబోతున్నారన్నారని చెప్పారు. కానీ లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ -2నుంచి ఎన్టీఆర్ తప్పుకున్నట్టు టాక్. 

ప్రస్తుతం ఎన్టీఆర్ రెండు సినిమాలు ఒప్పుకుని ఉన్నాడు. ఒకటి త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా. ఈ నెల 23నుంచి ఈ మూవీ ప్రారంభం కాబోతోంది. తర్వాత రాజమౌళితో.. రామ్ చరణ్ తో కలిసి మల్టీస్టారర్ చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలూ ఇప్పుడు తనకు చాలా కీలకం. ఈ రెండూ పెద్ద విజయాలు సాధిస్తే ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరుగుతుంది. ఈ టైమ్ లో మళ్లీ బిగ్ బాస్ అంటూ మైండ్ డైవర్ట్ చేయడం ఎందుకు అనుకునే ఆ షో నుంచి తప్పుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఈ జూలైలో ప్రారంభం కాబోతోన్న బిగ్ బాస్-2లో ఎన్టీఆర్ మెరుపులు ఉండవనే అంటున్నారు.  

More Related Stories