English   

ఎన్టీఆర్ తో చేయనన్న హీరోయిన్..?

NTR-shraddha
2018-03-04 14:08:45

తెలుగులో హీరోయిన్ల ఎంపిక దర్శకులకు పెద్ద టాస్క్ గా మారింది. పాత హీరోయిన్లైతే కాంబో ఫ్రెష్ గా అనిపించదు. కొత్తబ్యూటీస్ ను చూద్దామంటే ఎవరిని తీసుకోవాలా అనే కన్ఫ్యూజన్. నిన్నటి వరకూ యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటున్నారనే విషయంలో ఎవరికి వారు ఊహాగానాలు వినిపించారు. ఇప్పుడా ఊహల్లో మరో కొత్త ఊహ చేరింది. సాహోలో ప్రభాస్ తో రొమాన్స్ చేస్తోన్న శ్రద్ధా కపూర్ ను ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా అనుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. 

మంచి టాలెంటెడ్ బ్యూటీగా పేరుంది శ్రద్ధా కపూర్ కు. పైగా అందాల ఆరబోతలోనూ పెద్దగా కండీషన్స్ ఉండవు. ఈ కారణంగానే తనను టాలీవుడ్ కు తీసుకురావాలని చాలామంది ట్రై చేశారు. అప్పట్లో సౌత్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదీ భామ. ఫైనల్ గా బాహుబలి చూశాక ప్రభాస్ తో సినిమా అనేసరికి సై అంది. సాహోలో ప్రభాస్ సరసన నటించడానికి ఒప్పుకుంది. ఇక ఎలాగూ సౌత్ సినిమా ఒప్పుకుంది కదాని అప్పటి నుంచి ఇంకొందరు నిర్మాతలు శ్రద్ధ కోసం ట్రై చేస్తున్నారు. అలా ట్రై చేసిన వారిలో ఎన్టీఆర్ మూవీ ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారని టాక్. 

అయితే ఒక సినిమా తర్వాతే మరో సినిమా చేయాలని నిర్ణయం తీసుకుంది శ్రద్ధా. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ను మెయిన్టేన్ చేయాలంటే ఆ మాత్రం క్లారిటీ ఉండాలి కదా. తెలుగులో ఆఫర్స్ వచ్చినంత మాత్రాన బాలీవుడ్ ను వదులుకోదు కదా. అందుకే సాహో పూర్తయ్యే వరకూ మరో సినిమా చేయలేనని చెప్పిందని వినికిడి. ఆ కారణంగానే ఎన్టీఆర్ సినిమా చేయలేనని చెప్పిందని వినిపిస్తోంది. అయితే సాహో తర్వాత మరో స్టార్ హీరోతో సినిమా చేయడానికి ఆల్రెడీ సైన్ చేసిందని.. ఆ కారణంగానే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా వదులుకుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా అంటే ఓవర్శీస్ లో ఓ రేంజ్ లో ఉంటుంది. తను కూడా చేసి ఉంటే ఆ రేంజ్ బ్యూటీ అయ్యుండేది. ఎలాగూ సాహో వచ్చేది నెక్ట్స్ ఇయరే కాబట్టి.. 

More Related Stories