English   

ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్.. చిన్న శాంపుల్..

NTR-Trivikram

మొత్తం ప్రాడ‌క్ట్ ఎలా ఉందో తెలుసుకోడానికి చిన్న శాంపుల్ ఒక‌టి కూడా చూస్తుంటాం క‌దా..! అది బాగుంటే ప్రాడ‌క్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇక ఇప్పుడు త్రివిక్ర‌మ్ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇదే చూపించాడు. అజ్ఞాత‌వాసి ఫ్లాప్ తో త‌న స్టామినాను త‌క్కువ‌గా అంచ‌నా వేయొద్ద‌ని.. ఇప్ప‌టికీ త‌న క‌సి ఇంకా తగ్గ‌లేద‌ని.. ఒక్క ఫ్లాప్ తో ప‌డిపోయే ఇమేజ్ త‌న‌ది కాద‌ని నిరూపించుకునే ప‌నిలో ఉన్నాడు మాట‌ల మాంత్రికుడు. దీనీకి సాక్ష్యంగా ఇప్పుడు ఐపిఎల్ యాడ్ ను అద్భుతంగా తెర‌కెక్కించాడు త్రివిక్ర‌మ్. ఈయ‌న గతంలోనూ చాలా యాడ్స్ చిత్రీక‌రించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో ఈ యాడ్ షూట్ చేసాడు. ఇది ఇప్పుడు టీవీల్లో కూడా ప్లే అవుతుంది. యాడ్ అంటే ఏదో తూతూ మంత్రంగా కాకుండా ఎన్టీఆర్ తో ఓ భారీ డైలాగ్ కూడా చెప్పించాడు మాట‌ల మాంత్రికుడు. కారం లేని కోడి.. ఉల్లిపాయ లేని ప‌కోడి.. పెట్రోల్ లేని గాడి.. మీసం లేని రౌడీ.. ఆవ‌కాయ్ లేని జాడీ.. ప్రేమ‌గా అమ్మ ఒడి.. అంటూ భారీ డైలాగ్ ఒక‌టి సింపుల్ గా చెప్పేసాడు. తెలుగులో చూస్తే ఐపిఎల్ కు వ‌చ్చే మ‌జానే వేరు అని చెప్ప‌డానికి ఈ యాడ్ షూట్ చేసారు. మొత్తానికి ఎప్రిల్ 7 నుంచి ఈ తెలుగు ఐపిఎల్ స్టార్ గ్రూప్ లోనే సంద‌డి చేయ‌బోతుంద‌న్న‌మాట‌. 

More Related Stories