English   

త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా టైటిల్ సైలెంట్ మోడ్

NTR and Trivikram
2018-02-22 14:36:23

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకు టైటిల్ విషయంలో మెల్లగా క్లారిటీ వస్తోంది. ఈ టైటిల్స్ ను బట్టి గత కొంతకాలంగా వినిపిస్తోన్న రూమర్స్ కు చెక్ పెట్టే చాన్సుంది. మరి ఈ కథేంటో తెలియదు కానీ.. టైటిల్ విషయంలో మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ పేరు వినిపిస్తోంది. అది కూడా ఇంత వరకూ మనం టాలీవుడ్ లో చూడనిది. దాంతో పాటు మరో రెండు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అవి రొటీన్ గానే ఉన్నా.. ఇదే సౌండింగ్ తో సహా భలే అనిపిస్తోంది. అదేంటో తెలుసా.. సైలెంట్ మోడ్.. యస్.. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా టైటిల్ గా ఈ పేరునూ పరిశీలిస్తున్నారట. సైలెంట్ మోడ్ అనేది భలే ఉంది కదూ.. అయితే ఈ టైటిల్ పెట్టినా బావుంటుందని ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా.. దీంతో వినిపించే మరో పేరు విన్న తర్వాత.. 

ప్రస్తుతం ఈ మూవీ ఇన్ సైడ్ సోర్స్ నుంచి వినిపిస్తోన్న దాన్ని ఈ క్రేజీ కాంబోలో వచ్చే టైటిల్ కూడా డిఫరెంట్ గా ఉండాలనుకుంటున్నారట. ప్రస్తుతం మూడు టైటిల్స్ వినిపిస్తున్నాయి. అందులో ఒకటి సైలెంట్ మోడ్. తర్వాత సోల్జర్.. మూడోది రాముడు భీముడు. ఈ మూడో టైటిల్ ఇప్పటికే రెండు దశాబ్ధాలకు ఒకటి వాడుతున్నారు. అప్పుడెప్పుడో ఎన్టీవోడు వాడాడు కాబట్టి ఇప్పుడూ బావుంటుందనుకో అక్కర్లేదు. తరం మారింది. పైగా ఎన్టీఆర్ కూడా మారాడు. ఇక సోల్జర్ అనేది టైటిల్ కన్పార్మ్ కాకపోయినా సినిమా కథ దాని చుట్టూనే తిరుగుతుందనేది ప్రస్తుతం యంగ్ టైగర్ చేస్తోన్న వర్కవుట్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. నిజమే ఎన్టీఆర్ ఈ మూవీ కోసం ప్రత్యేకంగా ట్రైనర్ పెట్టుకుని మరీ డిఫరెంట్ ఫిజికల్ ఫిట్ నెస్ అండ్ లుక్ కోసం ట్రై చేస్తున్నాడు. మరవైపు అంటే కొన్నాళ్ల క్రితం వచ్చినట్టుగా ఇది ఆర్మీ బ్యాక్ డ్రాప్ లోసాగే కథే అనుకోవచ్చు. అందుకు సోల్జర్ అనే రొటీన్ టైటిల్ కంటే సైలెంట్ మోడ్ అనే టైటిలే బావుంటుందేమో కదూ.. లేకపోతే మళ్లీ ఏ ఆ ఇంటికి దారేదీ ఈ ఇంటికి దారేదీ వంటివి కాకుండా ఇలా చేస్తే త్రివిక్రమ్ సినిమాకూ కొత్త లుక్ వస్తుందేమో.. మరి త్రివిక్రమ్ ఈ సోల్జర్ ను సైలెంట్ మోడ్ లో ఉంచుతాడా లేక రాముడు భీముడులా రచ్చ చేయిస్తాడా అనేది చూడాలి.

More Related Stories